
నిన్నట్నుంచి సినీ, రాజకీయ రంగాల్లో హాట్ టాపిక్ అవుతున్న అంశం.. ఎన్టీఆర్ బయోపిక్. ఎన్టీఆర్ మీద సినిమా తీయబోతున్నట్లు తనదైన శైలిలో ఒక ఆడియో క్లిప్ ద్వారా అనౌన్స్ చేసి.. అందులో ఎన్టీఆర్ మీద ఓ పాట కూడా పాడేసి పెద్ద చర్చకు తెర తీశాడు రామ్ గోపాల్ వర్మ.
ఐతే ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తీయబోతున్నట్లుగా నందమూరి బాలకృష్ణ ప్రకటించిన నేపథ్యంలో బాలయ్య అన్నది.. ఇప్పుడు వర్మ అంటున్నది ఒకే సినిమా అన్న అభిప్రాయంలో జనాలున్నారు. బాలయ్య-వర్మ కలిసి ఎన్టీఆర్ మీద సినిమా చేయబోతున్నట్లుగా ఓ నిర్ణయానికి కూడా వచ్చేశారు. మీడియా వాళ్లు కూడా ఇలాగే రిపోర్ట్ చేస్తున్నారు.
కానీ వాస్తవం ఏంటంటే.. తాను తీయబోయే ఎన్టీఆర్ బయోపిక్‌లో హీరో బాలయ్య అని వర్మా ప్రకటించలేదు. అలాగే తాను సన్నాహాలు చేస్తున్న ఎన్టీఆర్ సినిమాకు వర్మను దర్శకుడిగా ఎంచుకున్నట్లు బాలయ్యా చెప్పలేదు. కానీ జనాలు మాత్రం వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా అంటూ ఊదరగొట్టేస్తున్నారు. కొందరు వర్మ-బాలయ్య కాంబినేషన్ అదుర్స్ అంటుంటే.. ఎన్టీఆర్ బయోపిక్‌ను వర్మ తీయడమేంటి అంటూ పెదవి విరుస్తున్నారు.
ఇంకా రకరకాల ఊహాగానాలు నడుస్తున్నాయి. పెద్ద డిస్కషన్లు సాగుతున్నాయి. మొత్తానికి వర్మ జనాల్ని పెద్ద డైలామాలోనే పడేశాడు. ఈ విషయంలో జనాలు క్లారిటీ కోసం ఎదురు చూస్తున్నారు. బాలయ్య నుంచి ప్రకటన ఆశిస్తున్నారు. నిజంగా బాలయ్య.. వర్మతోనే ఎన్టీఆర్ బయోపిక్ చేయబోతున్నాడా లేదా అన్న సంగతి బాలయ్య నోటి నుంచి వచ్చాక మిగతా చర్చలు సాగించవచ్చు. అంత వరకు కొంచెం ఆగితే బెటర్.
Recent Random Post: