
‘బిగ్ బాస్’ షోకి హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ని కోట్లు పెట్టి తీసుకున్నారు సరే, ఆ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రోమోలు డిజైన్ చేయడానికి ఒక ఎక్స్‌పర్ట్‌ని పెట్టుకోలేకపోయారా? ఈ షోకి చెందిన ప్రోమోలు ఒక్కొక్కటీ రిలీజ్ అయ్యే కొద్దీ షోపై ఉత్సుకత తగ్గిపోవడమే కాకుండా ఇదేదో వెకిలి ప్రోగ్రామ్‌లా వుందనే భావన కలుగుతోంది. ఇది వినోదభరితంగా వుంటుందనే సందేశాన్ని జనాలకి పాస్ చేసే ఉద్దేశంతో కామెడీ అనుకుని కట్ చేస్తోన్న ప్రోమోలు ఎన్టీఆర్‌ని హుందాగా కాకుండా వెకిలిగా చూపిస్తున్నాయి.
అతను కీ హోల్లో నుంచి చూస్తున్నట్టు, ఎక్కడో బీరువాల వెనక దాక్కుని అంతా గమనిస్తున్నట్టు చూపిస్తున్నారు. ఏదో ఒక సినిమాలో ఎవరో ఒక కమెడియన్ చేసిన సీన్లనే ఇక్కడ రిపీట్ చేస్తూ వుండేసరికి బిగ్ బాస్ ప్రోమోలు సోషల్ మీడియాలో ట్రోలింగ్కి గురవుతున్నాయి. ఎన్టీఆర్ రెగ్యులర్‌గా బుల్లి తెరపై చూడవచ్చునని ఉత్సాహంగా వున్న వీరాభిమానులు కూడా ఈ ప్రోమోలు చూసి షాకవుతున్నారు. ఎలాంటి ఎన్టీఆర్‌ని ఎలా చూపిస్తున్నారంటూ గోల పెడుతున్నారు.
మాస్ హీరోగా పవర్ఫుల్ పాత్రలకి పెట్టింది పేరయిన ఎన్టీఆర్‌కి స్టయిలింగ్ అంతా చక్కగా కుదిరినా కానీ ఈ ప్రోమో ఐడియాలు మాత్రం అట్టర్‌ఫ్లాప్ అవుతున్నాయి. బిగ్ బాస్ షోకి ఎన్నో ఏళ్లు హోస్ట్‌గా చేసిన సల్మాన్ ఖాన్ చాలా హుందాగానే ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేసినది గుర్తుంచుకుని, ఒక సూపర్‌స్టార్‌ని ఎలా ప్రెజెంట్ చేయాలో అలాగే చేస్తే మంచిది.
Recent Random Post: