
ఏళ్లకు ఏళ్లు ఇండస్ట్రీలో కంటిన్యూ కావటం.. అందునా హీరోయిన్ గా అంటే మాటలు కాదు. కాలం గడుస్తున్న కొద్దీ తన రేంజ్ ను మరింత పెంచుకోవటం అంత ఈజీ ఏమీ కాదు. కానీ.. అందుకు భిన్నంగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. టాలీవుడ్ లో స్పీడ్ కాస్త తగ్గినా.. కోలీవుడ్ ద్వారా ఆ లోటును తగ్గించుకున్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యన చిటపటలాడుతోంది.
టాలీవుడ్ అగ్ర హీరోలతో జత కట్టేయటమే కాదు.. ఏడాది మొదట్లో చిరుతో జత కొట్టి బంపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవటమే కాదు.. ఆ చిత్రంలో సరికొత్త అందాలతో మెరిసిపోయింది. అమ్మడి గ్లామర్ దెబ్బకు మరో ఐదేళ్ల వరకూ ఢోకా లేదన్న మాట వినిపించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో విజయ్.. అజిత్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలతో ఏక కాలంలో నటిస్తున్న హీరోయిన్ గా కాజల్ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు.
త్వరలో విడుదల కానున్న నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో దుమ్మే రేపేయటం ఖాయమన్న మాట వినిపిస్తోంది. హిందీలో కూడా ఒక అగ్రనటుడితో నటించే ఛాన్స్ సొంతం చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. సుదీర్ఘ కాలంగా హీరోయిన్ గా కొనసాగుతూ.. అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో బిజీబిజీగా ఉన్న కాజల్ మీద ఈ మధ్యన కొత్త రూమర్స్ వస్తున్నాయి.
అమ్మడు ఒక హీరోతో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందని.. అతడ్ని తరచూ రహస్యంగా కలుస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇవన్నీ ఉత్త పుకార్లేనని.. వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చింది. తనపై కుట్ర పన్నుతున్నారని.. తనను తొక్కేయాలని చూస్తున్నారంటూ మండిపడుతోంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా తన స్థాయిని.. స్థానాన్ని కదలించటం మాత్రం సాధ్యం కాదని చెబుతోంది. కూల్ గా ఉండే కాజల్.. తాజా వస్తున్న లవ్ ఊహాగానాల ఎపిసోడ్ లో మాత్రం చెడ్డ చిరాకు పడిపోతుందట.
Recent Random Post:

















