
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ మరో రికార్డు సృష్టించాడు. శంకర్ దర్శకత్వంలో ఆయన హీరోగా నటిస్తున్న స2.0 పై మొదటి నుంచే భారీ అంచనాలున్నాయి. రజనీ చిత్రాల్లోనే ‘2.0స బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. అయితే, షూటింగ్ సందర్భంగా కూడా తలైవా రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. దాదాపు 12 రోజుల పాటు నిర్విరామంగా ఓ సాంగ్ షూటింగ్ లో నటించి రజనీ సరికొత్త రికార్డు క్రియేట్ చేయనున్నాడు.
శంకర్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘2.0’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ లో ఒక పాట పెండింగ్ లో ఉంది. ఆ ఒక్క పాటను 12 రోజలు చిత్రీకరించడానికి శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో రజనీ, ఎమీ జాక్సన్ లపై తనదైన స్టైల్ లో శంకర్ ఈ సాంగ్ ను షూట్ చేయనున్నారు.
ఈ సాంగ్ కోసం ఇండోర్లో భారీ సెట్ సిద్ధం చేశౄరు. అక్కడ చాలా గ్రాండ్ గా ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నట్టు సమాచారం. తరువాత ఈ సాంగ్ కు భారీ గ్రాఫిక్స్ వర్క్ ను మిక్స్ చేస్తారట. దాదాపు 12 రోజుల పాటు ఈ పాట కంటిన్యూస్ షూటింగ్ ఉంటుందట. ఇంతవరకూ ఏ సాంగ్ ను కూడా ఇన్ని రోజుల పాటు నిర్విరామంగా చిత్రీకరించలేదట. దీంతో,ఈ రికార్డు కూడా తలైవా ఖాతాలోకే వెళ్లనుందని ఇండస్ట్రీ టాక్. 2018 జనవరి 25న ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.
Recent Random Post: