ఆగ‌స్టు 11న అబ‌ద్ధం ఆడ‌ట్లేదా?

సాధార‌ణంగా సినిమాల‌ను శుక్ర‌, శ‌ని, ఆది వార‌లు టార్గెట్ చేసుకొని శుక్ర‌వారం రిలీజ్ చేస్తుంటారు నిర్మాత‌లు. అయితే, ఆగస్టు 12-15 వ‌ర‌కు వరుసగా 4 రోజులు సెల‌వులు వ‌స్తున్నాయి. దీంతో, ఈ ఇండిపెండెన్స్ డే వీకెండ్ ను క్యాష్ చేసుకోవ‌డానికి నిర్మాత‌లు సిద్ధ‌మ‌య్యారు. ఆగ‌స్టు 11న త‌మ‌ సినిమాలను విడుదల చేసుకోవడానికి కొంతమంది దర్శక నిర్మాతలు, హీరోలు రెడీ అయ్యారు. ‘జయ జానకి నాయక’ .. ‘లై’ .. ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలు ఆ రోజు విడుద‌ల చేయాల‌నుకున్నారు. అయితే, ఆ రేసు నుంచి లై సినిమా త‌ప్పుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఆ వీకెండ్ పోటీ నుంచి తప్పుకోవాలని లై హీరో, దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నట్టు టాలీవుడ్ టాక్‌. భారీ బడ్జెట్ తో ‘లై’ సినిమాను తెరకెక్కించారు. దానికి తగిన వసూళ్లను రాబట్టాలంటే, ఈ పోటీలో విడుద‌ల చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అనుకున్నార‌ట‌.  అయితే, ఈ విష‌యంపై రెండు .. మూడు రోజుల్లో ద‌ర్శ‌క‌నిర్మాత‌ల నుంచి ఒక ప్రకటన వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఇప్ప‌టికే లై సినిమాపై నితిన్ అభిమానులు భారీ అంచ‌నాలు పెట్టుకున్నారు.


Recent Random Post: