వెంకటేష్ మాత్రం జెమ్ అమ్మా

తెలుగు సినీ పరిశ్రమకి చెందిన ఇద్దరు దిగ్గజాల ల్యాండ్మార్క్ సినిమాలు రిలీజవుతున్నాయి. ఈ సందర్భంగా ఈ ఇద్దరికీ మిత్రుడైన వెంకటేష్ ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణికి తన శుభాకాంక్షలు అందజేసారు. ఈ రెండు సినిమాల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని, ఇద్దరూ గొప్ప నటులే కాక తనకి మంచి స్నేహితులని, వీళ్లని తెరపై చూడడం కోసం ఎదురు చూస్తున్నానని వెంకీ ఫేస్బుక్ ద్వారా సందేశం పంపించారు.

ఈ వీకెండ్ పండగలా వుంటుందని, ఈ సంక్రాంతిని సంబరంలా చేసుకోవడానికి ఈ రెండు చిత్రాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు. అసలైతే ఈ సంక్రాంతి బరిలోనే వెంకీ గురు చిత్రం కూడా దిగాల్సి వుంది. అదే జరిగితే మళ్లీ 2002 సంక్రాంతిలా ముగ్గురి సినిమాలు ఒకేసారి వస్తాయని ఫాన్స్ ఎక్సయిట్ అయ్యారు.

అయితే ఈ రద్దీలో రిలీజ్ చేయకుండా గురుని హ్యాపీగా వేసవికి వాయిదా వేసేసి సమ్మర్ హాలిడేస్ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఎలాంటి భేషజాలు లేకుండా అందరితో కలివిడిగా వుండే వెంకీ ముందుగా చిరు, బాలయ్యకి విషెస్ అందించడం ద్వారా తన జెమ్లాంటి క్యారెక్టర్ని ఇంకోసారి చూపించారు. అందరు హీరోల అభిమానులు తనని సమానంగా ఎందుకు అభిమానిస్తారనేది వెంకీ మరోసారి చాటి చెప్పారు. ఇండస్ట్రీలో అందరూ తనలాంటి వాళ్లే వుంటే ఇక అసలు తెలుగు సినిమాకి సంబంధించి కాంట్రవర్సీ అంటూ వుండదు.


Recent Random Post: