రెండు నెలల్లో తాప్సీ రచ్చ రచ్చ

పింక్‌ సినిమాతో తాప్సీ టైమ్‌ స్టార్ట్‌ అయింది. అంతకు ముందు చెప్పుకోతగ్గ సినిమాలు కొన్ని చేసినప్పటికీ తాప్సీకి గుర్తింపు రాలేదు. పింక్‌తో తను నటించగలదని ప్రూవ్‌ అవడం, ఆ చిత్రం ఘన విజయం సాధించడంతో తాప్సీకి అవకాశాలు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. కెరియర్‌లో ఈ బూమ్‌ని ఆస్వాదిస్తోన్న తాప్సీ ఫిబ్రవరి, మార్చి నెలల్లో బాక్సాఫీస్‌ వద్ద రచ్చ చేయనుంది.

ఆమె నటించిన మూడు చిత్రాలు రెండు నెలల వ్యవధిలో బాక్సాఫీస్‌ వద్ద హల్‌చల్‌ చేయనున్నాయి. చాలా కాలంగా నిర్మాణంలో వున్న తాప్సీ చిత్రం ‘రన్నింగ్‌షాదీ.కామ్‌’ చిత్రానికి ‘పింక్‌’ పుణ్యమా అని విముక్తి లభించింది. ఈ చిత్రం ముందుగా ఫిబ్రవరి 3న విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ట్రెయిలర్‌లో తాప్సీ తనలోని కామెడీ యాంగిల్‌ చూపించి బాగానే ఆకట్టుకుంది.

దాని తర్వాత రాణాతో కలిసి ఆమె నటించిన ‘ది ఘాజీ ఎటాక్‌’ చిత్రం ఫిబ్రవరి 17న రిలీజ్‌ అవుతుంది. ఇక తనే టైటిల్‌ రోల్‌ చేస్తున్న ‘నామ్‌ షబానా’ మార్చి 31న విడుదలకి ముస్తాబవుతోంది. ఈ ఏడాదిలో తన కెరియర్‌ స్వరూపమే మారిపోతుందని, స్టార్‌ అయిపోతానని కలలు కంటోన్న తాప్సీకి ఈ మూడు చిత్రాలు చాలా కీలకం. మరి తన నమ్మకాన్ని ఈ చిత్రాలు ఏ లెవల్లో నిలబెడతాయనేది చూడాలి.


Recent Random Post: