డ్ర‌గ్స్ విచార‌ణ టైంలో బాల‌య్య అంత స‌పోర్ట్ చేశాడ‌ట‌

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు  పూరీ జ‌గ‌న్నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ‌తో పైసావ‌సూల్ చిత్రాన్ని తీసిన సంగ‌తి తెలిసిందే. సెప్టెంబ‌రు 1న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో చిత్ర బృందం బిజీబిజీగా ఉంది. ఇందులో భాగంగా ప‌లు మీడియా సంస్థ‌ల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు పూరీ. ఈ సంద‌ర్భంగా ఆయ‌న చేసిన ఒక ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఇప్పుడు అంద‌రి దృష్టిని విప‌రీతంగా ఆక‌ర్షిస్తోంది.

తాను క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు బాల‌కృష్ణ అండ‌గా ఉన్న‌ట్లు పూరీ వెల్ల‌డించారు. త‌న కెరీర్ లో చాలామంది స్టార్ హీరోల‌తో సినిమాలు తీసిన విష‌యాన్ని ప్ర‌స్తావించిన పూరీ.. ఆయ‌న‌తో తాను క‌లిసి ప‌ని చేసిన తొలి సినిమా అన్నారు. డ్ర‌గ్స్ కేసు వ్య‌వ‌హారంలో త‌న‌ను విచారించిన‌ప్ప‌డు బాల‌కృష్ణ చాలా స‌పోర్ట్ చేశాడ‌న్నారు. త‌న భార్య‌.. పిల్ల‌ల‌కు మోర‌ల్ స‌పోర్ట్ ఇచ్చిన ఒకేఒక్క హీరో బాల‌కృష్ణ అని అన్నారు. త‌న కుటుంబానికి బాల‌య్య అండ‌గా నిలిచార‌న్నారు.

యంగ్ హీరోల‌తో పోలిస్తే బాల‌కృష్ణ‌లో ఎన‌ర్జీ స్థాయి ప‌ది రెట్లు ఎక్కువ‌న్న పూరీ.. ఒక్క‌సారి కానీ ద‌ర్శ‌కుడ్ని బాల‌య్య న‌చ్చితే ఆయ‌న‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తార‌న్నారు. ఉద‌యం నాలుగు గంట‌ల‌కు లేచి ఆరు గంట‌ల‌కు సెట్ కు వ‌చ్చేస్తార‌న్నారు. త‌న తండ్రి ఎన్టీఆర్ పాట‌లు.. హిందీ క్లాసిక్స్ ను బాల‌య్య ఎప్పుడూ వింటుంటార‌న్నారు.


Recent Random Post: