
అవసరానికి తగ్గట్టు నాలిక మడతేసి మాట్లాడ్డంలో తాప్సీని కొట్టేవాళ్లుండరు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో పరిచయం కావడమే అదృష్టమని ఒకప్పుడు చెప్పుకున్న తాప్సీ తర్వాత అతడి దర్శకత్వ శైలిని వెక్కిరించింది. తెలుగు సినిమాల్లో నటిస్తున్నపుడు మన వాళ్లని ఆకాశానికి ఎత్తేసిన తాప్సీ బాలీవుడ్లో రెండు సినిమాలు వచ్చేసరికి తెలుగు చిత్రాలని కామెడీ చేయడం మొదలు పెట్టింది.
తను కేవలం అందాల ప్రదర్శనకి మాత్రం పరిమితం కావడానికి తెలుగు చిత్ర సీమే కారణమని, తనలోని నటిని బాలీవుడ్ గుర్తించి తగిన చిత్రాలు ఆఫర్ చేస్తోందని, ఇకపై అందాల ప్రదర్శన మీద డిపెండ్ అవనని చెప్పిన తాప్సీ ఒక కమర్షియల్ సినిమాలో అవకాశం వచ్చేసరికి చెప్పిన ప్రగల్భాలన్నీ మర్చిపోయింది. జుడ్వా 2లో మరో హీరోయిన్ జాక్వెలీన్ ఫెర్నాండేజ్‌ని మించి కనిపించడానికి తాప్సీ అవసరానికి మించి ఎక్స్పోజింగ్ చేసింది.
అదే పనిగా ముద్దులు, బికినీలతో కాలం గడిపేసింది. పాత్ర డిమాండ్ చేస్తే బికినీ వేయడం తప్పేమీ కాదని, బికినీ వేయడం కోసం తాను ఎంత కష్టపడాల్సి వచ్చిందో తెలిస్తే ఇలా చీప్‌గా మాట్లాడరని తన ద్వంద్వ వైఖరి మళ్లీ చాటుకుంటోంది.
ఇన్ని పాట్లు పడుతున్నందుకు, ఇన్ని జిత్తులు వేస్తున్నందుకు అయినా తనకి అక్కడ తగిన గుర్తింపు దక్కుతుందో లేదో మరి.
Recent Random Post: