బాలయ్యతో విబేధాలకి నాగార్జున ఫుల్స్టాప్

బాలకృష్ణ, నాగార్జునల మధ్య చాలా కాలంగా సఖ్యత లేదనేది సినీ ఇండస్ట్రీలో పాపులర్ రూమర్. నాగార్జున వున్న చోటకి బాలయ్య రాకపోవడం, ఇద్దరి ఇళ్లల్లో వేడుకలకి, పార్టీలకీ ఒకరిని ఒకరు పిలుచుకోకపోవడం ఆ రూమర్స్ని బలపరిచింది.

అక్కినేని మరణం సమయంలో నాగార్జునకి బాలయ్య సంతాపం తెలియజెప్పకపోవడం, అక్కినేని భౌతికకాయాన్ని సందర్శించకపోవడంతో ఈ విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయనే ప్రచారం ఊపందుకుంది.

అయితే నాగార్జున ఈ పుకార్లు అన్నిటికీ ఫుల్స్టాప్ పెడుతూ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ చిత్రానికి తన మనఃపూర్వక అభినందనలు చెప్పి తమ మధ్య దూరం లేదని స్పష్టం చేసారు. బాలయ్యకి, క్రిష్కి ‘శాతకర్ణి’ విడుదల సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తూ, తనకి చారిత్రిక చిత్రాలంటే చాలా ఇష్టమని, ఈ చిత్రం చరిత్ర సృష్టించాలని నాగార్జున అభిలషించారు.

ఖైదీ నంబర్ 150 విడుదలకి ముందు రోజు చిరంజీవికి కూడా ట్విట్టర్ ద్వారా విషెస్ తెలిపిన నాగార్జున ఇప్పుడు బాలయ్యతో తనకున్న డిఫరెన్సెస్ పక్కన పెట్టి పబ్లిక్ ప్లాట్ఫారంలో విషెస్ చెప్పి తన ‘అజాతశత్రువు’ ఇమేజ్ని ఇంకోసారి చాటుకున్నారు.


Recent Random Post: