
‘దేశం కోసం మీసం మెలేద్దామా..?’ డైలాగ్ లో ఎలాంటి రాజకీయం లేదని అన్నాడు ‘గౌతమి పుత్రశాతకర్ణి’ హీరో బాలకృష్ణ. సినిమా ట్రైలర్ దగ్గర నుంచినే పాపులర్ అయిన ఈ డైలాగ్ గురించి మీడియా బాలయ్య దగ్గర ఆరా తీసింది. ‘దేశం’ అంటే ఇక్కడ తెలుగుదేశమా? అనే సందేహాన్ని వ్యక్త పరిచింది. ఇందులో అంతర్లీనంగా అలాంటి ఉద్దేశం ఏమైనా ఉందా? అని అడిగింది. దీనిపై బాలయ్య స్పందిస్తూ అదేం లేదన్నాడు!
బాలకృష్ణ ఎలాగూ టీడీప ఈ ఎమ్మెల్యే కాబట్టి, తెలుగుదేశం పార్టీ అధినేతకు బామ్మర్ది కమ్ వియ్యంకుడు కాబట్టి.. ఆ డైలాగ్ పై సహజంగానే వీరు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘దేశం’ అంటే దేశం మాత్రమే.. తెలుగుదేశం కాదు.. అని బాలయ్య స్పష్టత ఇచ్చాడు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసం శాతకర్ణి యూనిట్ ప్రత్యేకంగా షో వేయించింది. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమానికి బాలకృష్ణ తో పాటు దర్శకుడు క్రిష్ హీరోయిన్ శ్రియ తదితరులు హాజరయ్యారు. క్రిష్ మాట్లాడుతూ.. త్వరలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కోసం కూడా ఈ సినిమా ప్రత్యేక షో ను వేయనున్నామని అన్నాడు.
Recent Random Post: