
కొందరు మగాళ్లు చాలా సెక్సీగా ఉంటారు. అయితే ఆ విషయాన్ని కనీసం వారే గుర్తించరు. ఆ విషయాన్ని వాళ్లకు ఎవ్వరూ చెప్పరు. దాని గురించి ఎవ్వరూ మాట్లాడరు! అదే ఆడవాళ్ల విషయానికి వస్తే మాత్రం అందరూ సెక్సీ అంటూ కామెంట్లు చేస్తారు… అని అంటోంది తమన్నా భాటియా. ఇటీవలే హీరోయిన్లపై తమిళ దర్శకుడొకరు చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించిన తమన్నా మగవాళ్ల సెక్సీదనం గురించి ఈ ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. సెక్సీ కామెంట్లు ఆడవాళ్లపైనే ఎందుకు? అని తమ్మూ ప్రశ్నిస్తోంది!
తమిళ దర్శకుడు హీరోయిన్లపై చేసిన కామెంట్లు నిజంగానే తనకు చాలా బాధను కలిగించాయని, ఆడవాళ్లంటే ఏమన్నా గమ్మున కూర్చుని ఉంటారని అనుకోకూడదు.. ఘాటుగా బదులిస్తారనే సందేశం ఇవ్వడానికే తను ఆ దర్శకుడి మాటలపై స్పందించాను అని తమన్నా వ్యాఖ్యానించింది.
ఇదే సమయంలో మీడియా నుంచి తమ్మూకు ఒక ఘాటైన ప్రశ్నే ఎదురైంది. ఆడవాళ్లపై సెక్సీ కామెంట్లు చేయకూడదని అంటున్నారు బాగానే ఉంది, తెరపై మీరు చేసే పాత్రల తీరేంటి? బాహుబలిలో మీ పాత్రను తీర్చిదిద్దిన తీరుపైనే బోలెడన్ని విమర్శలు వచ్చాయి కదా? అనే విషయం గురించి స్పందించమనగా, ‘చూసే దృష్టిని బట్టి ఉంటుంది..’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ. సినిమాల్లో పాత్రలను ఒక్కోరు ఒక్కో దృష్టితో చూస్తారని, అది సహజమేనని, అందరి ఈ అభిప్రాయాలూ ఒకలా ఉండవు కదా? అని ఎదురు ప్రశ్నించింది.
మొత్తానికి పైకేమో విరుచుకుపడింది… సినిమాల్లో చేసే పాత్రల గురించి సమాధానం ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రం తెలివిగా తప్పించుకొంది! తప్పదు మరి.. బతకాలి, దూసుకెళ్లాలి కదా!
Recent Random Post: