పచ్చ ప్రెస్ మీట్లు = సీబీఐ అఫిడవిట్లు!

వైఎస్ జగన్మోహన రెడ్డికి కోర్టు హాజరు నుంచి మినహాయింపు కాదు కదా.. అసలు పాదయాత్రకే అనుమతి ఇవ్వడానికి వీల్లేదంటూ.. కోర్టులో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ వాదనల పట్ల ప్రజల్లోను, వైసీపీ శ్రేణుల్లోను భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నాడంటేనే జడుసుకుంటున్న తెలుగుదేశం నాయకులు కొన్ని రోజులుగా ప్రెస్ మీట్ లు పెట్టి ఏ రకమైన విషాన్ని చిమ్ముతున్నారో.. ఇప్పుడు సీబీఐ అధికారులు అదే అంశాలను కౌంటర్ రూపంలో కోర్టుకు సమర్పించారనే మాట కర్ణాకర్ణిగా వినిపిస్తోంది. పచ్చ పార్టీ ప్రెస్ మీట్లలో నాయకులు చేస్తున్న దుడుకు వ్యాఖ్యానాలే.. సీబీఐ అఫిడవిట్లలోకి చట్టబద్ధమైన అభ్యంతరాల రూపం సంతరించుకుంటున్నాయని పలువురు అంటున్నారు.

వైఎస్ జగన్ పాదయాత్రను ప్రకటించి చాలా రోజులే అయింది. కాకపోతే.. పాదయాత్ర మధ్యలో ప్రతి శుక్రవారం హైదరాబాదులోని కోర్టుకు రావడం కష్టం గనుక.. దాన్నుంచి మాత్రమే మినహాయింపు అడుగుతున్నారు. అయితే కొన్ని రోజుల కిందట తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య, వేర్వేరు సందర్భాల్లో మరికొందరు నాయకులు కూడా ప్రెస్ మీట్ లు పెట్టి.. జగన్ చేపట్టే యాత్రే కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని వ్యాఖ్యలు చేశారు. కోర్టును అనుమతి అడగకుండానే జగన్ పాదయాత్రను ఎలా ప్రకటిస్తారు? అంటూ ఆయన విచిత్రమైన ప్రశ్నను లేవనెత్తారు.

ఒకవేళ తాను కోరిన అనుమతులు దక్కకపోతే గనుక.. ప్రతిశుక్రవారం ఏదో ఒక రకంగా సీబీఐ కోర్టుకు వచ్చి వెళ్లి.. మరుసటిరోజు మళ్లీ యాత్రలో జాయిన్ కాగలననే నమ్మకం జగన్ కు ఉన్నప్పుడు ఆయన ప్రత్యేకంగా యాత్రకు అనుమతి అడగాల్సిన అవసరం లేదు. రాజకీయ కార్యక్రమాలు చేసుకోవడానికి ఆయన ఎటూ అనుమతులు ఉండనే ఉన్నాయి. కాకపోతే.. ఈ పాదయాత్రను ముందే ప్రకటించడం ద్వారా.. అనుమతి ఇచ్చేలాగా కోర్టు మీద ఒత్తిడి తేవడానికి జగన్ ప్రయత్నిస్తున్నారంటూ తెదేపా నాయకుడు వర్ల రామయ్య మసిపూసి మారేడు కాయ చేసే ప్రయ్నతానికి తెగబడ్డారు.

ఆ రకంగా యెల్లో బ్రిగేడ్ ప్రెస్ మీట్లో వెల్లడించిన అభ్యంతరాలే ఇప్పుడు సీబీఐ అఫిడవిట్లో నకలు ప్రతిలాగా కనిపిస్తున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. శుక్రవారం హాజరు మినహాయింపులు ఇవ్వవచ్చా లేదా అనే విషయంలో అభిప్రాయాలు చెప్పమని మాత్రమే కోర్టు సీబీఐను కోరింది. అయితే వారు అసలు పాదయాత్ర గురించిన ప్రకటన చేయడమే కోర్టును అవమానించడం అవుతుంది. కోర్టును ధిక్కరించడం అవుతుంది అన్నట్లుగా రంగు పులిమి అఫిడవిట్లో పేర్కొనడం కరక్టు కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.


Recent Random Post: