
‘నేను పార్టీ మారడంలేదు మొర్రో..’ అని వైఎస్సార్సీపీ ఎంపీ బుట్టా రేణుక తెగేసి చెబుతున్నా, వైఎస్సార్సీపీకి చెందిన మీడియా సంస్థ ‘సాక్షి’ ఆమె పార్టీ మారిపోవడం ఖాయమని విశ్లేషిస్తోంది. అంటే, పొమ్మనకుండా పొగపెట్టడం.. అనుకోవాలేమో.! గత కొద్ది రోజులుగా బుట్టా రేణుక విషయంలో ‘పార్టీ ఫిరాయింపు’ ఊహాగానాలు గట్టిగా విన్పిస్తున్న విషయం విదితమే. నిజానికి నంద్యాల ఉప ఎన్నిక సమయంలోనే టీడీపీ, బుట్టా రేణుకకు ‘వల’ విసిరింది. కానీ, ఆమె అప్పట్లో టీడీపీ ఆఫర్ని తిరస్కరించారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్సీపీ తరఫున నిలబడ్డారామె.
ఏమయ్యిందో, మళ్ళీ ఇంకోసారి బుట్టా రేణుక విషయంలో ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈసారి ఊహాగానాలు సాక్షి మీడియా నుంచే విన్పిస్తుండడం గమనార్హం. దాదాపు 100 కోట్ల ప్యాకేజీని ఇందుకోసం టీడీపీ సిద్ధం చేసిందట. దాంతో ఆ ప్యాకేజీని బుట్టా రేణుక కాదనలేకపోతున్నారట. చంద్రబాబు విదేశీ పర్యటన తర్వాత ఏ క్షణంలో అయినా బుట్టా రేణుక పార్టీ మారొచ్చునట.
2014 ఎన్నికల అనంతరం కొద్ది నెలలకే బుట్టా రేణుక, తెలుగుదేశం పార్టీ పంచన చేరారు. అనూహ్యంగా ఆమె మళ్ళీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. లేకపోతే, ఎప్పుడో ఆమె టీడీపీలో చేరిపోయేవారే. వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఆల్రెడీ టీడీపీలోకి జంప్ చేసేశారు. ఇందులో కొత్తపల్లి గీత, టీడీపీలో చేరలేదంటూనే ఆ పార్టీకి అత్యంత సన్నిహతంగా వుంటున్నారు. బుట్టా రేణుక మాత్రం, టీడీపీలో చేరిపోవాలని అనుకుంటున్నారట.
ఇంతకీ, వైఎస్సార్సీపీలో బుట్టా రేణుకకి పొగపెడ్తున్నదెవరు.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ‘నేను పార్టీ మారడంలేదు..’ అని బుట్టా రేణుక తెగేసి చెప్పాక కూడా, ఆమెతో పార్టీ అధినేత వైఎస్ జగన్ మంతనాలు జరపలేదా.? ఆమెని ఇంకా బుజ్జగించాలనుకోవడం వేస్ట్ అని జగన్ ఫిక్సయ్యారా.? అధిష్టానం తీరుతో బుట్టా రేణుక పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారా.? వేచి చూడాల్సిందే.
Recent Random Post:
 
             
		
















