
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాని రాజకీయంగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వాణి విశ్వనాథ్‌ని రంగంలోకి దించిందట. దించితే దించొచ్చుగాక.! కానీ, రోజాకి పొలిటికల్ పంచ్ ఇచ్చేంత సీన్ వాణి విశ్వనాథ్‌కి వుందా.? ఇదే హాస్యాస్పదం మరి.! రోజా, వాణి విశ్వనాథ్.. ఇద్దరూ తెలుగు తెరపై ‘గ్లామరస్ హీరోయిన్లు’గా ఓ వెలుగు వెలిగినవారే. కానీ, ఇద్దరికీ చాలా తేడా వుంది.
రోజా హీరోయిన్గా తెలుగు, తమిళ సినీ పరిశ్రమలో స్టార్డమ్ సంపాదించుకుంది. రోజా స్టార్డమ్తో పోల్చితే, వాణి విశ్వనాథ్ సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు కాస్త తక్కువే. అన్నిటికీ మించి, రోజా గలగలా మాట్లాడేయగలదు. మంచి వాగ్ధాటి ఆమె సొంతం. వాణి విశ్వనాథ్ పరిస్థితి అది కాదు. తెలుగులో మాట్లాడటానికి వాణి విశ్వనాథ్ నానా తంటాలూ పడ్తోంది.
‘నేను ఎన్టీఆర్‌కి వీరాభిమానిని..’ అని చెప్పడానికి ముప్ఫయ్ నాలుగు మెలికలు తిప్పేస్తోంది తెలుగు భాషకి వాణి విశ్వనాథ్. వర్మకి వార్నింగ్ ఇచ్చేయడానికి టీడీపీ తరఫున వాణి విశ్వనాథ్ వకాల్తా పుచ్చుకున్నా, అక్కడికేదో ఆమె కామెడీ చేస్తున్నట్టుంది తప్ప.. అల్టిమేటం ఇచ్చినట్లు లేదు. ఇది లాంగ్వేజ్ వల్ల వచ్చే అతి పెద్ద సమస్య. ఇప్పుడే పరిస్థితి ఇలా వుంటే, 2019 ఎన్నికల నాటికి రోజాకి ధీటుగా వాణి విశ్వనాథ్‌ని దించితే పరిస్థితి ఎలా వుంటుందట.?
వాణి విశ్వనాథ్ దెబ్బకి రోజా సైలంటయిపోయిందంటూ టీడీపీ అనుకూల మీడియా అప్పుడే హడావిడి షురూ చేసేస్తోంది. అదే మరి కామెడీ అంటే. వర్మ ఇంటి ముందు ధర్నా చేస్తానని వాణి విశ్వనాథ్ చెబుతోందిగానీ, అంత సీన్ ఆమెకి వుందా.? వున్నపళంగా ఎన్టీఆర్ మీద వాణి విశ్వనాథ్‌కి ఇంత అభిమానం ఎక్కడినుంచి వచ్చేసిందట.! రోజాని రాజకీయంగా ఎదుర్కోవడానికి టీడీపీ ఎంత తొందరపడ్తోందో, వాణీ విశ్వనాథ్‌ని రంగంలోకి దించడంతోనే అర్థమవుతోంది. దురదృష్టవశాత్తూ ఆ తొందరపాటు అభాసుపాలైపోతోందని టీడీపీకి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో.!
Recent Random Post:

















