
స్పైడర్ సినిమా తర్వాత రెస్ట్ తీసుకునేందుకు విదేశాలకు వెళ్లిన మహేష్ బాబు హైదరాబాద్ తిరిగొచ్చాడు. అంతేకాదు.. నిన్నట్నుంచి కొత్త సినిమా సెట్స్ పైకి కూడా వచ్చేశాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ చేస్తున్న సినిమా ‘భరత్ అనే నేను’. ఈ మూవీ నిన్నట్నుంచి కొత్త షెడ్యూల్ లోకి ఎంటరైంది.
నిజానికి స్పైడర్ ఎఫెక్ట్ కొరటాల సినిమాపై పడుతుందని అంతా భావించారు. ఎందుకంటే సినిమా ఫ్లాప్ అయితే నెక్ట్స్ మూవీకి లాంగ్ గ్యాప్ తీసుకోవడం మహేష్ కు అలవాటు. ఈసారి కూడా అదే చేస్తాడని, ఫారిన్ టూర్ కు వెళ్లిన మహేష్ మళ్లీ ఎప్పుడొస్తాడో ఎవరికీ తెలీదని అంతా భావించారు.
కానీ మహేష్ మాత్రం ఈసారి గ్యాప్ తీసుకోలేదు. ఇప్పటికే ప్రారంభమైన సినిమాకు మధ్యలో గ్యాప్ ఇస్తే బాగుండదని భావించి వెంటనే సెట్స్ పైకి వచ్చేశాడు. పైగా ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలా ఆలస్యమైంది.
పొలిటికల్ థ్రిల్లర్ గా వస్తోంది భరత్ అనే నేను సినిమా. ఇందులో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
Recent Random Post:

















