గ్యాప్ తీసుకోలేదు.. అదే వచ్చింది

సాధారణంగా సినిమాల్లేకపోతే కావాలనే గ్యాప్ తీసుకున్నామని చెబుతుంటారు ఎవరైనా. దీనికి హీరోలు, హీరోయిన్లు అనే మినహాయింపు లేదు. అందరూ కామన్ గా చెప్పే డైలాగ్ ఇది. అయితే రవితేజ మాత్రం అలా చెప్పడం లేడు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసే ఈ హీరో తను కావాలని గ్యాప్ తీసుకోలేదని, ఆ గ్యాప్ అలా వచ్చేసిందని చెబుతున్నాడు.

“ఒక దశలో ఏం చేస్తున్నానో నాకు అర్థం కాలేదు. మొహమాటానికి పోయి ఫ్లాపులు తెచ్చుకున్నాను. సాధారణంగా నేను సినిమాల విషయంలో మొహమాటపడను. కానీ ఆ స్టేజ్ లో నాకు సంబంధం లేకుండానే అలా జరిగిపోయింది. ఇక ఇంతేనా అనుకుంటున్న టైమ్ లో అనుకోకుండా గ్యాప్ వచ్చేసింది. మార్కెట్ పరంగా, కథల పరంగా అప్పట్లో నా టైం బాగాలేదు.”

ఇలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడు రవితేజ. అయితే రెండేళ్ల గ్యాప్ వచ్చిందనే ఫీలింగ్ తనకు ఏమాత్రం కలగలేదంటున్నాడు ఈ హీరో. వరుసగా నాలుగేళ్ల పాటు ఆదివారాలు కూడా పనిచేసిన తను, ఈ రెండేళ్లలో చాలా దేశాలు చుట్టేశానని… చూడాలనుకున్న ఎన్నో సినిమాలు చూశానని అంటున్నాడు.

రాజా ది గ్రేట్ తో తన మైండ్ సెట్ మారిందంటున్న రవితేజ.. ఇకపై కథల ఎంపికలో కొత్తగా ఆలోచించే ధైర్యాన్ని ఆ సినిమా ఇచ్చిందంటున్నాడు.


Recent Random Post: