చిరంజీవి ముందు పవన్‌, చరణ్‌ కూడా జుజుబీ

‘ఖైదీ నంబర్‌ 150’ ఓపెనింగ్‌ వీకెండ్‌లో యుఎస్‌లో రెండు మిలియన్‌ డాలర్లు సాధించింది. ‘నాన్నకు ప్రేమతో’ లైఫ్‌టైమ్‌ వసూళ్లు దాటి ఆల్‌టైమ్‌ గ్రాసర్స్‌ లిస్ట్‌లో నాలుగవ స్థానంలో నిలిచింది. టాలీవుడ్‌ హిస్టరీలో రెండు మిలియన్‌ డాలర్లు దాటిన అయిదవ సినిమా ఇది. మెగా హీరోల్లో ఇంతవరకు ఎవరికీ దక్కని ఫీటు ముందుగా చిరంజీవికి దక్కింది. మిలియన్‌ డాలర్ల క్లబ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత వచ్చిన తొలి చిత్రంతోనే చిరంజీవి రెండు మిలియన్‌ డాలర్లను రాబట్టి తన స్టార్‌ పవర్‌ తెలియజెప్పారు. పవన్‌, చరణ్‌ యావరేజ్‌ సినిమాలు ఇక్కడ ఈ స్థాయిలో ఆడిన దాఖలాలు లేవు.

బ్లాక్‌బస్టర్‌ టాక్‌ వస్తే తప్ప మెగా హీరోలు యుఎస్‌ బాక్సాఫీస్‌ వద్ద సత్తా చాటుకున్న సందర్భాలు అరుదు. అలాంటిది చిరంజీవి ఒక యావరేజ్‌ సినిమాతో తనేంటన్నది చూపిస్తున్నారు. రెండు మిలియన్‌ డాలర్ల మార్కుని కంఫర్టబుల్‌గా దాటిన ఖైదీ నంబర్‌ 150కి మూడు మిలియన్లు అయితే అవుటాఫ్‌ రీచ్‌ కానీ ఫుల్‌ రన్‌లో రెండున్నర మిలియన్‌ డాలర్లు వసూలు చేస్తుందా లేదా అన్నది చూడాలి. ఓవర్సీస్‌లో ఖైదీ పర్‌ఫార్మెన్స్‌ ఇలాగుంటే, లోకల్‌ మార్కెట్‌లో చేసిన రచ్చ అలా ఇలా లేదు. ఏపీ, టీఎస్‌, కర్నాటకల్లో ఖైదీ సృష్టించిన ప్రభంజనం గురించిన వివరాలు నెక్స్‌ట్‌ అప్‌డేట్‌లో.


Recent Random Post: