
ఎన్టీఆర్ పై తయారవుతాయి అనుకుంటున్న రెండు బయోపిక్కులతో గ్యాసిప్ లే గ్యాసిప్ లు. జెడి చక్రవర్తి ఓ బయోపిక్ లో చంద్రబాబు క్యారెక్టర్ అన్నారు. కానీ అంతలోనే లేదని మళ్లీ వార్తలు వచ్చాయి. అలాంటి వార్తనే ఎన్టీఆర్ సినిమాలో కళ్యాణ్ రామ్ అంటూ బయటకు వచ్చింది.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టినపుడు చైతన్య రథంపై రాష్ట్రం అంతా పర్యటించారు. అప్పుడు ఆ చైతన్య రథాన్ని డ్రైవ్ చేసింది ఆయన కొడుకు హరికృష్ణనే. ఎన్టీఆర్ బయోపిక్ లో ఆ క్యారెక్టర్ కోసం కళ్యాణ్ రామ్ ను అడిగారని, ఓకె అన్నాడని గ్యాసిప్ బయటకు వచ్చింది. అయితే అస్సలు అలాంటి ప్రతిపాదన ఏదీ రాలేదని కళ్యాణ్ రామ్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
ప్రస్తుతానికి బాలయ్యకు, హరికృష్ణ కు మధ్య బాంధవ్యాలు వున్న మాట వాస్తవమే కానీ, అంత గొప్ప సంబంధాలు ఏవీ లేవన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి అలాంటి నేపథ్యంలో ఇలాంటి ప్రతిపాదన వచ్చి వుంటుందని ఎలా అనుకున్నారో?
Recent Random Post:

















