
ఈ మధ్య చాలాసార్లు వార్తల్లో వినిపించిన, కనిపించిన కాంబినేషన్ మైత్రీ మూవీస్-శ్రీనువైట్ల-రవితేజ సినిమా. అయితే ఈ సినిమా వుంటుందని, కాదు వుండదని ఇలా రకరకాలుగా గ్యాసిప్ లు వినిపించాయి. అయితే మైత్రీ నిర్మాతలు, శ్రీను వైట్ల ఓ అగ్రిమెంట్ కు వచ్చినట్లు తెలుస్తోంది.
తాము ప్రస్తుతం నిర్మిస్తున్న రామ్ చరణ్ -సుకుమార్ కాంబినేషన్ రంగస్థలం 1985 సినిమా, అలాగే నిర్మించబోయే చందు మొండేటి-నాగ చైతన్య సినిమా పూర్తయిన తరువాత రవితేజ-శ్రీను వైట్ల సినిమా స్టార్ట్ చేస్తామని, అంతవరకు ఆగగలిగితే సరే అని, లేదంటే వేరే నిర్మాతతో చేసుకోమని మైత్రీ జనాలు చెప్పేసినట్లు తెలుస్తోంది.
దాంతో వెయిట్ చేయడానికి శ్రీను వైట్ల ఓకె అన్నట్లు తెలిసింది. ఈ సినిమా కూడా శ్రీనువైట్లకు కాస్త రెమ్యూనిరేషన్, కాస్తే ప్రాఫిట్ షేర్ పద్దతినే వుంటుంది.
ఇంకో గమ్మత్తేమిటంటే, ఈ సినిమాకు శ్రీను వైట్ల సోలోగా వర్క్ చేసుకుంటున్నారు. గతంలో గోపీమోహన్ అండగా వుండేవారు. ఆయన ఇప్పుడు ఈ సినిమాకు పని చేయడం లేదని తెలుస్తోంది.
Recent Random Post:

















