దెయ్యాలన్నీ వదిలేస్తే, మిగిలేదేంటి.?

టీడీపీని వీడేదాకా ఆయనే తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ‘గ్లామర్‌ వున్న’ లీడర్‌. కానీ, ఇప్పుడాయన దెయ్యం. అవును, దెయ్యం తెలుగుదేశం పార్టీని వీడిపోయి, కాంగ్రెస్‌ పార్టీలో చేరిందంటూ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ, ఇటీవలే టీడీపీకి గుడ్‌ బై చెప్పిన రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడిపోయారు. తప్పదు మరి, రాజకీయాల్లో ఇలాంటివన్నీ కామనే.

కానీ, మరీ ‘దెయ్యం’ అనేస్తే ఎలా.? తెలుగుదేశం పార్టీని వీడినవారంతా దెయ్యాలైతే, ఇంకా మిగిలిపోయినవారిని ఏమనాలి.? వాళ్ళు కూడా దెయ్యాలుగా మారి, తెలుగుదేశం పార్టీని వీడే రోజు ఎంతో దూరంలో లేదు. ఆల్రెడీ, రేవంత్‌ ‘ఎగ్జిట్‌’తో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది. మిగిలిన నేతలేమో, టీఆర్‌ఎస్‌ వైపు ‘ఆశగా’ ఎదురుచూస్తున్నారు. అందులో ఎల్‌.రమణ కూడా వున్నారన్నది తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో విన్పిస్తోన్న గాసిప్‌.

ఇలా ముఖ్యమైన దెయ్యాలంతా (సారీ సారీ.. రమణ లాంగ్వేజ్‌ వచ్చేసినట్టుంది) టీడీపీని వీడితే, అక్కడ మిగిలేదాన్ని ఏమనాలి.? పాత నీరు పోయి, కొత్త నీరు రావడం అనే మాట చెప్పుకోడానికి బాగానే వుంటుందిగానీ, భవిష్యత్తులో వర్షాలే కురిసే పరిస్థితి లేక, ఎడారిగా మారిపోతే ఏమనగలం.? తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితి ఇదే.

దేవేందర్‌గౌడ్‌, టీడీపీని వీడినప్పుడు ‘తెలంగాణలో టీడీపీకి వచ్చిన నష్టమేమీ లేదు..’ అన్న నాగం జనార్ధన్‌రెడ్డీ, టీడీపీకి గుడ్‌ బై చెప్పేశారు. ఆయన హవా కొన్నాళ్ళు టీడీపీలో సాగింది. ఆ తర్వాత ఆయన టీడీపీని వీడితే, రేసులో ముందుకొచ్చింది ఎర్రబెల్లి దయాకర్‌రావు. ఎర్రబెల్లి, టీడీపీకి గుడ్‌ బై చెప్పి, టీఆర్‌ఎస్‌లో చేరడంతో.. రేవంత్‌రెడ్డి లైన్‌లో ముందున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి పార్టీ నుంచి బయటకెళ్ళడంతో, ఎల్‌.రమణ హవా షురూ అయ్యింది.

నిజానికి ఎల్‌.రమణ, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు.. రేవంత్‌రెడ్డి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌.. అయినా, అప్పట్లో సీన్‌ రేవంత్‌రెడ్డికే వుండేది. ఇదొక్కటి చాలు, ఎల్‌.రమణకి తెలంగాణ టీడీపీలో ఎంత సీనుందో.!

కొసమెరుపు: కొడంగల్ ఉప ఎన్నిక వస్తే, ఘనవిజయం సాధించడం ద్వారా టీడీపీ సత్తా ఏంటో చూపిస్తామనీ, రేవంత్ రెడ్డికి ఝలక్ ఇస్తామని ఎల్.రమణ అంటున్నారు. అది సాధ్యమేనా.?


Recent Random Post: