
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం బట్టారు. ప్రతిపక్షాల వాదనలను సూటిగా తిప్పికొడుతున్నారు. తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఒక కీలకమైన మాట చెప్పారు. ప్రతిపక్షాలు చేసిన రభసకు సమాధానంగా ఆయన సుదీర్ఘమైన ప్రవాహ ప్రసంగంలో ఆ చిన్న అంశం మరుగున పడిపోయింది గానీ… వాస్తవానికి చాలా కీలకమైనది. కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక లాంటిది. కేసీఆర్ పట్టుదలకు ఉదాహరణ లాంటిది. అలాగే తెలంగాణ ప్రజల్లో కొత్త సచివాలయాన్ని కోరుకుంటున్న వారుంటే గనుక… వారిని నిర్ఘాంతపరిచేది.
వివరాల్లోకి వెళితే….
బైసన్ పోలో గ్రౌండ్స్ ను కొత్త సచివాలయ నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకోనున్నట్లు , ఒప్పందం కుదిరినట్లు ఆ నడుమ చర్చ జరిగింది. బైసన్ పోలో గ్రౌండ్ క్రీడా ప్రాంగణమని కొందరు తెరపైకి తెచ్చారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన బైసన్ పోలో గ్రౌండును నామరూపాల్లేకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ప్రతిపక్షాలన్నీ కేసీఆర్ చర్యలను తప్పుబట్టాయి. ఇవ్వన్నీ పట్టించుకునేది లేదని కేసీఆర్ మాటల్లోనే తేలిపోయింది.
బైసన్ పోలో గ్రౌండులో కట్టడాలకు అనుమతికోసం ఎదురు చూస్తున్నమనీ.. అనుమతిస్తే ప్రదాని నరేంద్రమోడీ చేతులమీదుగా భూమిపూజతో పునాదిరాయి వేస్తామని ఆయన మనసులో మాట బయటపెట్టారు. ప్రతిపాదనకొచ్చిన తర్వాత ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగిన నేపథ్యంలో భూమి హక్కులపై నిశితంగా పరిశీలించి మాట్లాడినట్లు కన్పిస్తోంది. నిజాం జమానాలో మైదాన్ని బ్రిటీషు ప్రభుత్వ సైన్యానికి అప్పగించారు.
బైసన్ పోలో గ్రౌండ్ కు సంబంధించి యాజమాన్య బదలాయింపులో జాప్యం జరిగింది. ఇది సైనిక స్థలం కూడా కాదు. మన అవసరాలకు కేంద్ర అనుమతికోసం ఎదురు చూడాల్సి వస్తోంది. సామరస్యం అనుమతి ఇస్తే సరి. లేకుంటే న్యాయపరంగా పోరాటం చేసి సాధిస్తాననే ధీమా కేసీఆర్ లో వ్యక్తమైంది. కేసీఆర్ తన చాతుర్యంతో సామ,దాన ఉపాయాలతో కేంద్రాన్ని సానుకూలంగా స్పందించే విధంగా మార్గం సుగమం చేశారు. ప్రతిపక్షాల కుట్రతో కేంద్రప్రభుత్వం బెట్టుగా వ్యవహరిస్తే దండోపాయానికి దిగుతామని సంకేతమిచ్చారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు తన మార్కు కట్టడాలు చరిత్ర నిలిచిపోవాలనే ఉద్ధేశం స్పష్టమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న పనిచేసి తీరాలన్నదే తన లక్ష్యమని సభాముఖంగా సభ్యులకు వివరించారు. వందేళ్లకు పనికొచ్చేలా సచివాలయంతో పాటు శాసనసభ, ఆయా విభాగాధిపతుల కార్యాలయాలు, తెలంగాణ భారతిని సికింద్రాబాద్ బైసన్‌పోలో మైదానంలోనే నిర్మిస్తామని సృష్టంచేశారు. మొత్తం మీద కేసీఆర్ బైసన్ పోలో మైదానంలో అనుకున్న విధంగా తెలంగాణ శాసనసభ, సచివాలయం, కళాభవన సముదాయాలను నిర్మించే విషయంలో వెనుక అడుగు వేసేటట్లు కన్పించడంలేదు.
Recent Random Post:

















