బన్నీతో చరణ్కి గొడవేం లేదు మిత్రమా

అల్లు అర్జున్, రామ్ చరణ్ మధ్య విబేధాలు వచ్చాయని, కేవలం చిరంజీవి అనే లింక్ ఒక్కటే ఈ కజిన్స్ ఇద్దరినీ కలిపి ఉంచుతోందని ఒక పుకారు లేవదీసారు. ఇంతకీ ఈ కన్క్లూజన్కి రావడానికి వారిచ్చిన వివరణ ఏమిటో తెలుసా? ‘150’ వేడుక స్టేజీ మీద ఇద్దరూ సరిగా మాట్లాడుకోలేదట.

అల్లు అర్జున్ మాట్లాడుతున్నా కానీ చరణ్ పొడి పొడి సమాధానాలిచ్చాడట. ఈ పుకారుకి కాస్త వెయిట్ ఇవ్వడానికి అల్లు శిరీష్ని పర్సనల్గా ఈ ఈవెంట్కి ఎవరూ ఆహ్వానించలేదని కాస్త మసాలా దట్టించారు. కానీ ఈ ఇద్దరు కజిన్స్ మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇద్దరి మధ్య ఎప్పటిలానే బలమైన సంబంధాలున్నాయి. చరణ్ ఆ స్టేజీ మీద బన్నీతోనే కాదు, ఎవరితోను సరిగా మాట్లాడలేదు.

తన స్పీచ్ని కూడా కేవలం కొద్ది క్షణాల్లో ముగించేసి తాను ఎంత టెన్స్గా ఉన్నాడనేది చెప్పకనే చెప్పాడు. అల్లు ఫ్యామిలీకి, పవన్కళ్యాణ్కీ పడడం లేదనేది జగమెరిగిన సత్యం. చిరంజీవి పూర్తిగా అల్లుతో సంబంధాలు తెంచుకోలేడు కనుక పవన్తో రిలేషన్ మెయింటైన్ చేస్తూ, ఇటు అల్లు ఫ్యామిలీతో కూడా క్లోజ్గా ఉంటూ చరణ్ చాలా మెచ్యూర్డ్గా వ్యవహరిస్తున్నాడు.

పవన్కళ్యాణ్కి ఉన్న అసలు ప్రాబ్లమ్స్ ఏంటనేది తెలిసిన చరణ్ తరచుగా అన్నదమ్ముల మధ్య మాటలకి, మీటింగులకి అవకాశం కల్పిస్తూ కుటుంబాన్ని మొత్తం కలిపి ఉంచడానికి తనదైన శైలిలో కృషి చేస్తున్నాడు. అందరినీ కలుపుకుపోయే మనస్తత్వమున్న చరణ్ అకారణంగా బన్నీతో వైరం పెట్టుకుంటాడని మెగా ఫ్యామిలీ గురించి తెలిసిన ఎవ్వరూ అనుకోరు. ఇవన్నీ కేవలం ఊసుపోని గాలి వార్తలే తప్ప నమ్మదగ్గ మేటర్ అస్సల్లేదు.


Recent Random Post: