రంగస్థలంలో పండగే పండగ

1985నాటి కథతో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ స్టిల్స్ షేర్ చేస్తున్నాడు రామ్ చరణ్. తాజాగా ఈ హీరో మరో స్టిల్ రిలీజ్ చేశాడు. రంగస్థలం సినిమా కోసం వేసిన జాతర సెట్ ఫొటో ఇది. అచ్చం 1980ల నాటి కాలాన్ని ప్రతిబింబించేలా ఉన్న ఈ స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదే సెట్ కు సంబంధించి హీరోయిన్ సమంత కూడా మరో ఫొటో రిలీజ్ చేసింది. ఈ రెండు ఫొటోలు రంగస్థలంపై బజ్ ను మరింత పెంచాయి. హైదరాబాద్ బూత్ బంగ్లా సమీపంలో ఈ భారీ సెట్ వేశారు.

మనాలీలో భార్యతో కలిసి విహారయాత్ర పూర్తిచేసిన చరణ్, నాగచైతన్యతో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీతో చిన్న గెట్ టు గెదర్ పార్టీ కంప్లీట్ చేసిన సమంత నిన్నట్నుంచి ఈ కొత్త షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు.

మరోవైపు బిజినెస్ పరంగా కూడా రంగస్థలం వార్తల్లోకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్, డిజిటర్ రైట్స్ 20కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా ఫ్యాన్సీ రేటుకు అమ్ముడుపోయాయి. ప్రస్తుతం సౌత్ సినిమాలకు ఉత్తరాదిన మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో రంగస్థలం హిందీ డబ్బింగ్ రైట్స్ కు ఏకంగా 10కోట్ల 50లక్షల రూపాయల రేటు పలికింది.


Recent Random Post: