
కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్లంతా ఇప్పుడిప్పుడే ఓపెన్ అవుతున్నారు. పరిశ్రమలో కొనసాగాలంటే పక్కలోకి వెళ్లాలనే పాడు సంస్కృతిపై మొన్నటిమొన్న ఆండ్రియా, శ్రద్ధాదాస్ లాంటి తారలు ఓపెన్ గా స్టేట్ మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడీ లిస్ట్ లోకి రాయ్ లక్ష్మీ కూడా చేరింది. ఈ వ్యవహారంపై మరింత ఓపెన్ గా మాట్లాడింది ఈ ముద్దుగుమ్మ.
“అవును.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. ఇది నాకు కూడా అనుభవమే. రాత్రికి రమ్మని నన్ను నేరుగా ఎవరూ అడగలేదు కానీ పరోక్షంగా ఇలాంటి ఆపర్లు కొన్ని వచ్చాయి. ఒక రాత్రి గడిపితేనే ఆఫర్ ఇస్తామనే వాళ్లు కొంతమంది ఉన్నారు. అలాంటివి నేను తిరస్కరించాను. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమకొచ్చే వాళ్లకు ఇలాంటి అనుభవాలు ఎక్కువ. వాళ్లకు మరోదారి లేదు. ఒక రాత్రి గడపాలి లేదంటే ఇండస్ట్రీ నుంచి బయటకెళ్లిపోవాలి.” ఇలా ఓపెన్ గా ఉన్నది ఉన్నట్టు చెప్పేసింది రాయ్ లక్ష్మి.
ఒక వ్యక్తితో ఒకరాత్రి గడపాలా వద్దా, అతడి కోరిక తీర్చాలా వద్దా లాంటి అంశాలపై పూర్తి నిర్ణయం మహిళదే అయి ఉండాలని కొన్ని రోజుల కిందట ఆండ్రియా ప్రకటించింది. ఈ విషయంతో రాయ్ లక్ష్మీ పూర్తిగా ఏకీభవించింది. “అవును.. అది మహిళ హక్కు, ఈ విషయంలో ఎవర్నీ బయవంతం చేయకూడదు” అంటోంది.
అయితే తన అభిప్రాయాలన్నీ సౌత్ ఇండస్ట్రీ వరకు మాత్రమే పరిమితమని, బాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ గురించి తనకేం తెలియదని అంటోంది రాయ్ లక్ష్మీ. ఆమె నటించిన జూలీ-2 సినిమాలో కాస్టింగ్ కౌచ్ ఎలిమెంట్ కూడా ఉంది.
Recent Random Post:

















