జై సింహా: షూటింగ్ తో పాటు ప్రచారం కూడా

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న మూవీ జై సింహా. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విశాఖ పరిసర ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ఈమధ్యే ఈ సినిమాకు సంబంధించి టైటిల్ డిజైన్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. ఆ బజ్ ను అలానే కంటిన్యూ చేయాలని నిర్ణయించారు మేకర్స్.

సినిమా షూటింగ్ ఒకవైపు, ప్రచారం మరోవైపు కొనసాగించాలని ఫిక్స్ అయింది యూనిట్. ఇందులో భాగంగా జై సింహా సినిమాకు సంబంధించి వర్కింగ్ స్టిల్స్ ను దశలవారీగా విడుదల చేయడం స్టార్ట్ చేసింది. తాజాగా వైజాగ్ షెడ్యూల్ కు సంబంధించిన స్టిల్స్ ను రిలీజ్ చేశారు.

నిజానికి యూనిట్ తో సంబంధం లేకుండా జై సింహా ఆన్-లొకేషన్ స్టిల్స్ ఎప్పటికప్పుడు లీక్ అయిపోతున్నాయి. ఇకపై అఫీషియల్ గా రిలీజ్ అవుతాయన్నమాట. సంక్రాంతి కానుకగా జనవరి 12న జై సింహాను విడుదల చేయాలని నిర్ణయించారు. అంటే అటుఇటుగా 2 నెలలు మాత్రమే టైం ఉంది. అందుకే ప్రమోషన్ ను ఇప్పట్నుంచే మొదలుపెట్టాలని నిర్ణయించారు.


Recent Random Post: