
క్రిష్ దర్శకత్వంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘మణికర్ణిక’ సినిమా తెరకెక్కుతోన్న విషయం విదితమే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుం జోధ్‌పూర్‌లో జరుగుతోంది. జనవరి నాటికి సినిమా పూర్తి చేసి, ఆ తర్వాత గ్రాఫిక్స్ పనుల్ని మొదలుపెట్టి, ఏప్రిల్ నాటికి సినిమా రిలీజ్ చేయాలన్నది ‘మణికర్ణిక’ టీమ్ ప్లాన్.
ఇక, నేడు క్రిష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సెట్స్‌లో కంగనా రనౌత్, దర్శకుడు క్రిష్‌కి సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చింది. అదే క్రిష్ బర్త్ డే సెలబ్రేషన్. షూటింగ్ సీరియస్‌గా ఓ పక్క జరుగుతోంటే, కంగనా భారీ కేక్‌కి ఆర్డర్ ఇచ్చిందట. కేక్ రావడం, షూటింగ్‌కి చిన్నపాటి బ్రేక్ ఇవ్వడం.. ఆ బ్రేక్‌లో క్రిష్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరగడం.. అంతా చకచకా జరిగిపోయాయట.
ఊహించని ఈ గిఫ్ట్ పట్ల క్రిష్ చాలా చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. సోషల్ మీడియా వేదికగా, కంగనాకి థ్యాంక్స్ చెప్పాడు క్రిష్. అన్నట్టు, ‘మణికర్ణిక’ రాణి ఝాన్సీ లక్ష్మీబాయి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న విషయం విదితమే. స్వాతంత్య్ర పోరాటంలో ధీర వనితగా పేరు తెచ్చుకున్న రాణి ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది.
Recent Random Post:

















