
సుదీర్ఘ కాలం విరామం ఉండని పని, ప్రవృత్తిగా గడిపిన వారు ఒక్కసారిగా పదవీ విరమణ చెందితే తట్టుకోలేరు. కేవలం పని చేయకుండా ఉండలేకపోవడం మాత్రమే కాదు.. హోదా, అధికార వైభోగం లేకుండా జీవించడం కూడా వారికి చాలా కష్టసాద్యంగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో అదే కసరత్తు జరుగుతోంది. మాంఛి అధికార హోదా ఉన్న కుర్చీ కోసం మాజీ ఐఏఎస్ లు పలువరు అనేక ప్రయత్నాలు చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది.
ఏపీలో సమాచార హక్కు కమిషనర్లను నియమించాల్సి ఉంది. చాలాకాలంగా ఈ పోస్టులు పెండింగులోనే ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ లుగా పదవీ విరమణ చెందిన పలువురు అధికారులు ఈ పదవికోసం ప్రయత్నిస్తున్నారట. సమాచార హక్కు కమిషనర్లంటే.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాన హోదా ఉండేలాంటి చట్టబద్ధ పదవిగా గుర్తింపు ఉంది. ఒకసారి ఈ పదవిలోకి వెళితే.. మంచి వేతన భత్యాలు, అధికార గౌరవంతో ఆరేళ్లపాటూ ఢోకా లేకుండా పదవిలో ఉండొచ్చు.
పైగా ఇది మామూలు నామినేటెడ్ పోస్టుల్లాంటిది కాదు. నియామకం జరిపిన ప్రభుత్వం గద్దెదిగిపోయినా.. వీరి పదవి మాత్రం పదిలంగా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఈ పదవికోసం మాజీ ఐఏఎస్ లలో పోటీ పెరుగుతోందిట. రిటైరైన వారిలో ఏకె ఫరీడా, మాజీ డీజీపీ జెవి రాముడు తదితరులు దీనికోసం ప్రయత్నిస్తున్నారట.
అలాగే తెలంగాణ సర్వీస్ లో రిటైరైన ఐఏఎస్ అధికారి ఎంజి గోపాల్ కూడా.. ఏపీ సమాచార హక్కు కమిషనర్ పోస్టుకోసం ప్రయత్నించుకుంటున్నట్లు సమాచారం. ఇంకా పలువురు మాజీ ఉన్నతాధికారులు క్యూ కడుతున్నారుట. ఐపీఎస్ సూర్యనారాయణ, ఐఎఫ్ఎస్ మల్లికార్జునరావు తదితరులందరూ ఆర్టీఐ కమిషనర్ పదవికోసం.. నానా ప్రయత్నాలు చేసుకుంటున్నారని అమరావతి వర్గాలు పేర్కొంటున్నాయి.
వీరిలో జెవిరాముడుకు పదవి ఖరారు అని.. ఆయనను ఆర్టీఐప్రధాన కమిషనర్ కూడా చేసే అవకాశం ఉన్నదని అంటున్నారు. అయినా మరొక పోస్టు అయినా దక్కకపోతుందా అనే ఉద్దేశంతో సీనియర్ అధికార్లంతా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది.
Recent Random Post: