
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘టెంపర్’ సినిమా టైటిల్లోనే బోల్డంత టెంపర్ కన్పిస్తుంటుంది. సినిమాలో చాలావరకు హీరో ఎన్టీఆర్ బిగుసుకుపోయి కన్పిస్తాడు. ఆ పాత్రకి వున్న ‘టెంపర్’ అలాంటిది. అక్కడక్కడా కామెడీ కోసం స్టిఫ్నెస్ విషయంలో కొంచెం తగ్గుతాడేమోగానీ, ఓవరాల్గా సినిమాలో ఎక్కడా ‘టెంపర్’ తగ్గినట్లు కన్పించదు.
కానీ, హిందీలో రీమేక్ అవుతున్న ‘టెంపర్’కి మాత్రం చాలా మార్పులు జరిగిపోతున్నాయ్. ‘సింబా’ పేరుతో తెలుగు ‘టెంపర్’ హిందీలోకి రీమేక్ అవుతున్న విషయం విదితమే. అసలు దీన్ని ‘రీమేక్’ అంటేనే ఒప్పుకోవడంలేదు దర్శకుడు రోహిత్ శెట్టి. ఎందుకంటే, ‘టెంపర్’ సినిమా నుంచి కొన్ని సన్నివేశాల్ని మాత్రమే తీసుకున్నాడట హిందీ ‘శింబా’ కోసం. సినిమా నిండా నవ్వులే నవ్వులన్నది రోహిత్ శెట్టి చెబుతున్న మాట. అంటే, ఇది కామెడీ వెర్షన్ ‘టెంపర్’ అనుకోవాలేమో.!
”ఎంటర్టైన్మెంట్కి అధిక ప్రాధాన్యతనిస్తున్నాం. అలాగని సినిమాలో ‘సోల్’ ఏమాత్రం దెబ్బతినదు. ఖచ్చితంగా ఇదో అద్భుతమైన సినిమా అవుతుంది..” అని దర్శకుడు రోహిత్ శెట్టి చెబుతున్నా, ఫస్ట్ లుక్ విడుదలయ్యాక మాత్రం, అనుమానాలైతే షురూ అవుతున్నాయి. రోహిత్ శెట్టిని తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. ఏమో, రోహిత్ శెట్టి ఏం మ్యాజిక్ చేయబోతున్నాడో వేచి చూడాల్సిందే.
Recent Random Post: