
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రేణు దేశాయ్ విడిపోయి చాలా ఏళ్లయింది. ఆమెకు దూరమయ్యాక పవన్ వేరే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కూడా కన్నాడు. అయినప్పటికీ పవన్‌తో బంధాన్ని పూర్తిగా తెంచుకోవడానికి రేణు ఇష్టపడట్లేదు. అధికారికంగా విడాకులైతే ఎప్పుడో వచ్చేశాయి కానీ.. పవన్‌తో మానసిక బంధాన్ని మాత్రం ఆమె తెంచుకోవట్లేదు. పలు సందర్భాల్లో పవన్ మీద తన ప్రేమను చాటుకుంటూ.. అతడిని తానెంత మిస్సవుతున్నదీ పరోక్షంగా చాటి చెబుతూనే ఉంది రేణు. తాజాగా ఆమె రిలీజ్ చేసిన వీడియో కూడా పవన్ మీద ప్రేమను చాటుకునేదే.
తన జీవితంతో పెనువేసుకుపోయిన కొన్ని జ్ఞాపకాలు మళ్ీ గుర్తుకొచ్చాయంటూ కొంచెం ఉద్వేగం, ఆవేదన కలగలిపి రాసుకున్న ఒక కవితతో కూడిన వీడియో అది. దీనికి రేణు వ్యాఖ్యానం చూస్తే అది పవన్‌ను ఉద్దేశించిందే అన్నది స్పష్టంగా తెలిసిపోతుంది. ‘‘నా జ్ఞాపకాలన్నీ చూసుకుంటున్నా.. ఆయన మాటలు, పదాలు, ఆయన పేరు చెక్కిన కలం నా జ్ఞాపకాల్లో ఉన్నాయి.. కానీ కమ్ముకున్న మంచు కరిగిపోయి మళ్లీ ఆ జ్ఞాపకాలు నా కళ్లముందు నిలిచాయి.. ఆ జ్ఞాపకాలను ఇప్పుడు తిరిగి చూసుకుంటే తుప్పుపట్టిన కలం, దానిపై రాసుకున్న పేరు తుడిచిపెట్టుకుపోయాయి. ముక్కలైన హృదయం, నేను రాసుకున్న లేఖల కాగితపు ముక్కులు కనిపించాయి’’.. ఇలా చాలా ఉద్వేగభరితంగా సాగే కవిత అది. దీనికి ‘డాలర్- ఎ ఫిగర్ ఆఫ్ స్పీచ్’ అని పేరు పెట్టుకుంది రేణు. ఇంతకుముందు కూడా పలు సందర్భాల్లో పవన్ మీద ప్రేమ తనకిప్పటికీ తగ్గలేదని.. బలవంతంగానే ఆయనకు దూరమయ్యానని చెప్పకనే చెప్పిన రేణు.. ఇప్పటికీ తన మాజీ భర్త జ్ఞాపకాల నుంచి బయట పడలేకపోతోందని చెప్పడానికి ఈ వీడియో తాజా రుజువు.
Recent Random Post:

















