రామ్ చరణ్ పరీక్ష పాసయ్యాడు

రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాను పూర్తి చేసి రెండు నెలలు దాటింది. అయినా ఇప్పటికీ తన కొత్త సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్లలేదు. అలాగని స్క్రిప్టు ఇంకా పూర్తి కాలేదా అంటే అదేమీ లేదు. ఏడాది కిందటే ఫ్రీ అయిపోయిన సుకుమార్.. చరణ్ సినిమా కోసం ఆల్రెడీ స్క్రిప్టు రెడీ చేసేశాడు. ఐతే ఈ సినిమాలో కథానాయకుడి పాత్రకు తగ్గట్లుగా మేకోవర్ కోసం చరణ్ వెయిట్ చేయాల్సి వచ్చింది.

సుక్కు మూవీ కోసం ఇంతకుముందెన్నడూ కనిపించని లుక్‌లోకి మారుతున్నాడు చరణ్. ఇందుకోసమే రెండు నెలలు సమయం తీసుకున్నాడు. ‘ఖైదీ నెంబర్ 150’ ప్రి రిలీజ్ ఈవెంట్లో కనిపించిన చరణ్ కొత్త అవతారం సుక్కు కోసమే. బాగా గడ్డం పెంచడంతో పాటు లుక్ ఇంకొంచెం మార్చుకోవాలని సుక్కు చెప్పాడని.. సంక్రాంతి తర్వాత ఆయనకు కనిపించి ఆమోద ముద్ర వేయించుకోవాల్సి ఉందని.. ఆయన సంతృప్తి చెందకపోతే ఇంకో నెల రోజులు సమయం పట్టొచ్చని చరణ్ అన్నాడు అప్పట్లో.

ఐతే లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. చరణ్ లుక్‌కు సుక్కు ఓకే చెప్పాడు. తాను కోరుకున్న లుక్ ఇదేనని తేల్చేయడంతో సినిమాను మొదలుపెట్టేయడానికి రంగం సిద్ధమైంది. ఈ నెల 30న ఈ చిత్రాన్ని సెట్స్ మీదికి తీసుకెళ్లనున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. చరణ్ సరసన రాశి ఖన్నా, అనుపమ పరమేశ్వరన్ ఇందులో కథానాయికలుగా నటిస్తున్నారు .


Recent Random Post: