
సుకుమార్-మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన ‘1 నేనొక్కడినే’ పెద్ద డిజాస్టర్. అయినప్పటికీ ఈ చిత్రం అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్బులో చేరింది. అంచనాలకు మించి వసూళ్లు రాబట్టింది. ఇక ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ రూపొందించిన ‘నాన్నకు ప్రేమతో’ తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరుగా ఆడింది. అది అమెరికాలో ఏకంగా 2 మిలియన్ డాలర్లు కొల్లగొట్టింది. దీన్ని బట్టే సుక్కుకి అమెరికాలో ఏ స్థాయిలో మార్కెట్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు అతడి ట్రాక్ రికార్డు రామ్ చరణ్ కు కూడా బాగానే కలిసొస్తున్నట్లుంది. ‘ధృవ’ మినహాయిస్తే అమెరికాలో చరణ్ రికార్డు పేలవం. అయినప్పటికీ సుక్కు అండతో చరణ్ చెలరేగిపోతున్నాడు.
సుకుమార్-రామ్ చరణ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘రంగస్థలం’కు అమెరికాలో అదిరే స్పందన వస్తోంది. ప్రిమియర్ల కలెక్షన్లు అంచనాల్ని మించి పోయేలా ఉన్నాయి. సాయంత్రానికే ప్రిమియర్ల ప్రి సేల్స్ 3.5 లక్షల డాలర్లకు చేరుకోవడం విశేషం. మొత్తం ప్రిమియర్లు అయ్యేసరికి ఈ లెక్క ఎక్కడికి చేరుతుందో చూడాలి. ఆ వివరాలు.. శుక్రవారం మధ్యాహ్నానికి వస్తాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగడం ఖాయం. ప్రిమియర్లతోనే మిలియన్ డాలర్ల క్లబ్బుకు చేరువగా వచ్చినా ఆశ్చర్యం లేదు.
ఆటోమేటిగ్గా 2 మిలియన్ క్లబ్బులోకి కూడా అడుగుపెట్టేస్తుంది ‘రంగస్థలం’. అమెరికాలో ప్రిమియర్లు.. ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో చరణ్ కు ‘రంగస్థలం’ ది బెస్ట్ కాబోతోందన్నది స్పష్టం. మొత్తంగా ఈ చిత్రం ఎలా పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.
Recent Random Post: