
మరో 4రోజుల్లో భరత్ అనే నేను సినిమాకు సంబంధించి భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఏప్రిల్ 7న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. తన సినిమా ప్రమోషన్స్ కు పొలిటికల్ టచ్ ఇస్తూ పేర్లు పెడుతున్న కొరటాల శివ.. ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు ‘భరత్ బహిరంగ సభ’ అనే పేరు ఫిక్స్ చేశాడు.
ఇదిలా ఉండగా.. ఈ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు చరణ్, ఎన్టీఆర్ ను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించబోతున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మహేష్ బాబు స్వయంగా ఎన్టీఆర్ కు ఫోన్ చేసి, ఫంక్షన్ కు రావాల్సిందిగా కోరాడట. దీనికి ఎన్టీఆర్ వెంటనే ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.మరోవైపు రామ్ చరణ్ ను కూడా ఈ ఫంక్షన్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ప్రత్యేకంగా చరణ్ ను కలిశారు. రంగస్థలం సక్సెస్ అయినందుకు చెర్రీకి ఓ స్పెషల్ గిఫ్ట్ అందిస్తూనే, భరత్ అనే నేను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు రావాల్సిందిగా కోరారు. దీనికి చరణ్ కూడా ఓకే చేసినట్టు తెలుస్తోంది.
స్వతహాగా ఫ్రెండ్స్ అయిన చరణ్, ఎన్టీఆర్ ఒకే వేదికపై కలవడానికి పెద్దగా ఇబ్బంది ఉండదు. మరీ ముఖ్యంగా వీళ్లిద్దరూ కలిసి త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో సినిమా కూడా చేయబోతున్నారు. సో.. ఈ శనివారం ఒకే వేదికపై మహేష్, చరణ్, ఎన్టీఆర్ ను చూడబోతున్నామన్నమాట.
Recent Random Post: