
రాజమౌళితో చేయాల్సిన మల్టీస్టారర్ ప్రాజెక్టుపై మొన్నటికిమొన్న పెద్ద బాంబ్ పేల్చాడు రామ్ చరణ్. అంతా సెట్ అయిపోయిందని ఆడియన్స్ నిబ్బరంగా ఉన్న టైమ్ లో, అసలు రాజమౌళి తనకు నెరేషన్ ఇవ్వలేదని ప్రకటించి సంచలనం సృష్టించాడు చరణ్. ఇప్పుడా విషయాన్ని ఎన్టీఆర్ కూడా నిర్థారించాడు.
చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రాబోతోంది ఈ మల్టీస్టారర్. అయితే చరణ్ కు మాత్రమే కాదని, తనకు కూడా కథ చెప్పలేదని అంటున్నాడు ఎన్టీఆర్. మరోవైపు ఈ ఇద్దరు హీరోలకు నెల రోజుల కిందటే రాజమౌళి కథ వినిపించాడంటూ గతంలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. స్టోరీలైన్ చెప్పకుండా తప్పించుకునేందుకు చెర్రీ, తారక్ ఇలా అబద్ధం ఆడుతున్నారా? లేక నిజంగానే రాజమౌళి వీళ్లకు కథ చెప్పలేదా అనేది డౌట్.
లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. చరణ్, ఎన్టీఆర్ కు రాజమౌళి కేవలం స్టోరీలైన్ మాత్రమే చెప్పాడట. కంప్లీట్ నెరేషన్ ఇంకా ఇవ్వలేదని తెలుస్తోంది. టెస్ట్ కట్ పూర్తయిన తర్వాత స్క్రీన్ ప్లే మొత్తం చెబుతానన్నాడట జక్కన్న. రాజమౌళిపై నమ్మకంతో హీరోలిద్దరూ టెస్ట్ కట్ కోసం అమెరికా వెళ్లారు. టెస్ట్ కట్ చూసి సంతృప్తి చెందిన తర్వాతే ఈ మల్టీస్టారర్ ప్రాజెక్టును #RRR పేరుతో అఫీషియల్ గా ఎనౌన్స్ చేశాడు రాజమౌళి.
చాలామంది భావిస్తున్నట్టు ఈ సినిమాకు ఇంకా పూర్తి స్థాయిలో స్క్రీన్ ప్లే సిద్ధమవ్వలేదనేది అవాస్తవం. రాజమౌళి, విజయేంద్రప్రసాద్ కలిసి ఈ మల్టీస్టారర్ స్క్రీన్ ప్లేను లాక్ చేశారు. ఓ మంచి టైమ్ చూసి హీరోలిద్దరికీ కంప్లీట్ నెరేషన్ ఇవ్వబోతున్నాడు. రాజమౌళి నెరేషన్ ఇచ్చిన తర్వాత అందులో ఎవరూ మార్పులు చెప్పరని టాక్. ఈసారి కూడా అదే జరుగుతుందేమో చూద్దాం.
Recent Random Post: