ఫస్ట్ టైం ఆ పనికి ఒప్పుకున్న సమంత

హీరోయిన్ గా ఎన్నో విజయాలు అందుకుంది. ప్రస్తుతం స్టార్ స్టేటస్ ఎంజాయ్ చేస్తోంది. మెల్లమెల్లగా లేడీ ఓరియంటెడ్ కథలకు కూడా షిఫ్ట్ అయింది. కానీ ఇన్ని చేసినా డబ్బింగ్ విషయంలో మాత్రం సమంత ఎప్పుడూ రిస్క్ చేయలేదు. సినిమాల్లో తన సొంత గొంతును ఎప్పుడూ వినిపించలేదు. ఎట్టకేలకు ఆ పని చేయబోతోంది . సొంతంగా డబ్బింగ్ కు రెడీ అవుతోంది ఈ బ్యూటీ.

సమంతకు ఎప్పుడూ సింగర్ చిన్మయి డబ్బింగ్ చెబుతూ ఉంటుంది. సమంత సక్సెస్ అవ్వడానికి ఇది కూడా ఓ మెయిన్ రీజన్. అలాంటిది ఇప్పుడు చిన్మయిని పక్కనపెట్టి, తనే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవాలని డిసైడ్ అయింది సమంత. అది కూడా మహానటి సినిమా కోసం.మహానటి సినిమాకు సంబంధించి సొంత డబ్బింగ్ లకే ప్రాధాన్యం ఇస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. దుల్కర్ తో ఇప్పటికే జెమినీ గణేశన్ పాత్రకు డబ్బింగ్ చెప్పించాడు.

అజ్ఞాతవాసిలో సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్న కీర్తిసురేష్.. ఇందులో కూడా మరోసారి డబ్బింగ్ చెప్పుకునే అవకాశం ఉంది. ఇక మిగిలింది సమంత మాత్రమే. ఆమెతో కూడా సొంతంగానే డబ్బింగ్ చెప్పించాలని నాగ్ అశ్విన్ ఫిక్స్ అయ్యాడు. సో.. మహానటి సినిమాలో సమంత అసలు గొంతు వినబోతున్నామన్నమాట.


Recent Random Post: