
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామంటూ నమ్మించి, రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడదీసి, ఆనక చేతులు దులిపేసుకున్న కేంద్ర ప్రభుత్వంపై పవన్‌కళ్యాణ్ పోరాటం మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా కోసం పవన్ కొన్ని సభలు చేపట్టినప్పటికీ చలనం రాలేదు. పవన్‌కి మద్దతు పలికితే ఎక్కడ రాజకీయ ముద్ర పడుతుందోనని సెలబ్రిటీలు సైలెన్స్ పాటించారు.
అయితే జల్లికట్టు నిషేధంపై తమిళులు చేసిన పోరాటం, చివరకు సుప్రీం తీర్పునే తిరగరాసి హక్కులు సాధించుకోవడం చూసి మనవాళ్లలో చలనం వచ్చింది. కేవలం ఒక ఆట కోసమే వాళ్లు అంతగా పోరాడితే, రాష్ట్ర భవిష్యత్తుకోసం మనమెంత చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ యువత ముందుకు కదులుతోంది. ఈ నెల 26న వైజాగ్ ఆర్కే బీచ్‌లో కుర్రకారు అంతా చేరి ప్రత్యేక హోదా కోసం మౌన పోరాటం చేయనుంది.
ఈ పోరాటానికి పవన్ జనసేన మద్దతు తెలుపగా, ఇంతకాలం సైలెంట్‌గా ఉన్న హీరోలు కూడా జనంతో గళం కలపడానికి సై అంటున్నారు. సందీప్ కిషన్ అయితే ఆ రోజున ఆర్కే బీచ్‌కి వస్తానని ప్రకటించాడు. నిఖిల్ కూడా ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని గళం విప్పాడు. ఇక టాప్ హీరోలంతా ఒక్కొక్కరుగా దీనిపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది.
జల్లికట్టు విషయంలో మాట్లాడిన వాళ్లంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం పేరిట జరుగుతోన్న ఈ పోరాటానికి మద్దతు పలకక తప్పదు. స్పెషల్ స్టేటస్ వెంటనే ఇవ్వకున్నా, ఇది తేలిగ్గా తీసుకునేది కాదని ప్రభుత్వానికి ఇప్పుడు తెలిసి వస్తుందనడంలో సందేహం లేదు.
Recent Random Post: