సుచి లీక్స్ టైపులో టాలీవుడ్ లో ఇప్పుడు శ్రీరెడ్డి లీక్స్ పాపులర్ అయిపోయాయి. మొన్నటికి మొన్న శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు, దర్శకుడు శేఖర్ కమ్ములకు కోపం తెప్పించాయి. ఆ వ్యాఖ్యల్ని ఓపెన్ గా ఖండించిన కమ్ముల.. లీగల్ గా చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమౌతున్నారు. ఇప్పుడు మరో హీరోపై సంచలనాత్మక ప్రకటన చేసింది శ్రీరెడ్డి.
“నిజ జీవితంలో కూడా నువ్వు బాగా నటిస్తున్నావు. తెరపై కూడా నువ్వు నేచురల్ గా కనిపిస్తావు. కానీ అది నీ ముసుగు మాత్రమే. ఎంతో కష్టపడి పైకొచ్చానని చెప్పుకుంటావ్. కానీ అది ప్రజల్ని ఎమోషనల్ గా మోసంచేయడం మాత్రమే. ప్రజల ముందు పెద్ద డ్రామా రక్తికట్టిస్తావ్. వరుసగా నీకు విజయాలొస్తున్నాయి. నీకు ఓ చిన్న కొడుకు కూడా ఉన్నాడు. జీవితంలో నువ్వు జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే గతంలో నువ్వు ఎంతోమంది అమ్మాయిల్ని మోసం చేశావు. వాళ్ల జీవితాలతో ఆడుకున్నావ్. వాళ్లంతా ఏడుస్తున్నారు. దేవుడున్నాడు. తప్పకుండా నిన్ను శిక్షిస్తాడు.”
ఇలా సాగింది శ్రీరెడ్డి పోస్ట్. ఈసారి కూడా ఆమె మరింత జాగ్రత్తగా వ్యవహరించింది. గతంలో పెట్టిన పోస్టులో కొమ్ములు తిరిగిన శేఖరుడు లాంటి పదాలు వాడిన శ్రీరెడ్డి, ఈసారి అలాంటి పదప్రయోగాల జోలికి కూడా పోలేదు. కేవలం నేచురల్ హీరో అనే పదాన్ని మాత్రమే వాడింది. వరుస విజయాలు అందుకుంటున్న ఆ హీరోపై విమర్శలు చేసింది.
“చరణ్, ఎన్టీఆర్, మహేష్ ను చూసి నేర్చుకో. వారసత్యం ఉన్నప్పటికీ, వాళ్లు ఎంత మంచిగా బిహేవ్ చేస్తారో చూసి నేర్చుకో. తండ్రి, తాత సపోర్ట్ ఉన్నప్పటికీ వాళ్లు ఎంత పద్ధతిగా ఉంటారో చూడు. వాళ్లకు ఎలాంటి ఇగో లేదు. కానీ నువ్వు అలా కాదు. యాటిట్యూట్ చూపిస్తావ్. చిన్న దర్శకుడులంటే నీకు చిన్నచూపు.”
ఇలా సదరు “నేచురల్ హీరో”పై విరుచుకుపడింది శ్రీరెడ్డి. అయితే శ్రీరెడ్డి పెట్టిన ఈ పోస్ట్ ఒకెత్తయితే.. ఆమె తాజాగా చేసిన ప్రకటన మరో ఎత్తు. ఎవరూ ఊహించని విధంగా ఈరోజు ఓ ఆశ్చర్యకరమైన విషయంతో ప్రజల ముందుకొస్తానంటోంది శ్రీరెడ్డి.
Recent Random Post:

















