రేపు చిరు సమ్మోహనం

దాసరి కన్నుమూసిన తర్వాత ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా మారారు చిరంజీవి. చిన్నాపెద్దా తేడాలేకుండా అందరితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. పలు ఈవెంట్స్ కు హాజరవుతున్నారు. ఇందులో భాగంగా మరో చిన్న సినిమా వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరవుతున్నారు చిరంజీవి. సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం సినిమాకు ప్రచారం కల్పించబోతున్నారు.

మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా సమ్మోహనం అనే సినిమా తెరకెక్కుతోంది. అదితి రావు హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా టీజర్ ను రేపు రిలీజ్ చేయబోతున్నారు. ఈ టీజర్ రిలీజ్ వేడుకకు చిరంజీవి హాజరవుతున్నారు. తన చేతులమీదుగా టీజర్ ను ఆవిష్కరించబోతున్నారు. ఘట్టమనేని కాంపౌండ్ కు చెందిన వ్యక్తి సుధీర్ బాబు. సాధారణంగా ఈ హీరో ఫంక్షన్లకు మహేష్ వస్తుంటాడు. లేకపోతే కృష్ణ లేదా విజయనిర్మలతో కార్యక్రమాలు కానిచ్చేస్తుంటారు. కానీ ఈ హీరో ఫంక్షన్ కు ఓ మెగా హీరో రావడం, అందునా చిరంజీవి లాంటి వ్యక్తి రావడం ఇదే ఫస్ట్ టైం.

రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది సమ్మోహనం సినిమా. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించాడు. అదితి రావుకు తెలుగులో ఇదే మొట్టమొదటి స్ట్రయిట్ సినిమా. చెలియా మూవీలో ప్రేక్షకులకు పరిచయమౌంది ఈ ముద్దుగుమ్మ.


Recent Random Post: