
అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నా పేరు సూర్య’ తెల్లారేసరికల్లా థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీమియర్స్ టైం స్టార్ట్ అయిపోయింది కూడా. ఇలాంటి సమయంలో మూవీపై ఆసక్తి మరింతగా పెంచడం కోసం మెయిన్ టీం అంతా తెగ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.
నా పేరు సూర్య చిత్రంతో రైటర్ వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఎన్టీఆర్ కు టెంపర్ కథ ఇచ్చిన తర్వాత తన దర్శకత్వంలోనే సినిమా చేసేందుకు వక్కంతం బాగానే వెయిట్ చేశాడు. మూవీ కన్ఫాం అని కూడా అంతా అనుకున్నారు. కానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. కొంత సమయం వేచి చూసి.. ఆ తర్వాత అల్లు అర్జున్ ను మూవీకి ఒప్పించాడు వక్కంతం వంశీ. దీంతో ఎన్టీఆర్ కు వినిపించిన కథ రెడీమేడ్ గా ఉండడంతో.. స్క్రిప్ట్ కూడా ప్రిపేర్డ్ గా ఉండడంతో.. అదే కథను బన్నీకి వినిపించి సినిమాకు ఒప్పించాడనే టాక్ వచ్చింది. కానీ దీనిపై వక్కంతం వెర్షన్ వేరేగా ఉంది.
‘ఎన్టీఆర్ తో సినిమా అనుకున్నపుడు అది డిఫరెంట్ స్టోరీ. ఏదో ఒకరోజున ఎన్టీఆర్ తో సినిమా చేస్తాను. ఆ కథను కేవలం ఎన్టీఆర్ ను దృష్టిలో ఉంచుకునే రాశాను. ఆ సినిమా ఎప్పటికైనా ఎన్టీఆర్ తోనే చేస్తాను’ అని చెప్పాడు వక్కంతం వంశీ. ఇంత కాన్ఫిడెంట్ గా అదే కథను ఎన్టీఆర్ తో చేస్తానని రైటర్ కం డైరెక్టర్ చెబుతుండడంతో.. నా పేరు సూర్య ను ఎన్టీఆర్ కథ అనడం కరెక్ట్ కాదనే సంగతి అర్ధమవుతోంది.
Recent Random Post: