
ఓవైపు రాజకీయాలు చేస్తూనే, మరోవైపు సినీ పరిశ్రమకు కూడా దగ్గరగా ఉంటున్నాడు పవన్. ఇప్పటికే నా పేరు సూర్య, నేల టిక్కెట్టు, రంగస్థలం లాంటి సినిమా ఫంక్షన్లకు హాజరయ్యాడు. ఇదే కోవలో ఇప్పుడు మరో సినీ వేడుకకు పవన్ హాజరయ్యే అవకాశాలున్నాయి. అదే సాక్ష్యం సినిమా.
బెల్లంకొండ సాయిశ్రీనివాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సాక్ష్యం సినిమా పాటల్ని ఈనెల 26న విడుదల చేయబోతున్నారు. హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో ఫంక్షన్ కు పవన్ ప్రత్యేక అతిథిగా హాజరయ్యే అవకాశముంది. అయితే ఈ సినిమా ఫంక్షన్ కు పవన్ రావడానికి కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.
నాగబాబు కోరిక మేరకు నా పేరు సూర్య థ్యాంక్స్ మీట్ కు పవన్ హాజరయ్యాడు. ఇక రామ్ తళ్లూరితో ఫ్రెండ్ షిప్ కొద్దీ నేలటిక్కెట్టు ఆడియో రిలీజ్ కు వచ్చాడు. నిర్మాతలతో ఆర్థిక లావాదేవీలతో పాటు చరణ్ కోరిక మేరకు రంగస్థలం సినిమా ఫంక్షన్ కు హాజరయ్యాడు పవన్. మరి సాక్ష్యంతో పవన్ కు ఎలాంటి కనెక్షన్ ఉందనేది తేలాల్సి ఉంది.
Recent Random Post:

















