తెలుగోళ్లు వెళ్లగొట్టేశారు కానీ.

కేథరిన్ థ్రెసాకు అందంతో పాటు కొంచెం పొగరు కూడా ఎక్కువే అంటారు టాలీవుడ్ జనాలు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే.. వాటిలో ‘సరైనోడు’ మినహాయిస్తే సక్సెస్ లేదు. అయినప్పటికీ అమ్మడు చాలాసార్లు తన యాటిట్యూడ్ చూపించి వివాదాస్పదురాలిగా పేరు తెచ్చుకుంది.
మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో పక్కన ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ దక్కితే.. అక్కడ కూడా కొంచెం తేడాగా ప్రవర్తించిన అవకాశాన్ని వదులుకుంది. ఈ దెబ్బతో కేథరిన్‌కు తెలుగులో మళ్లీ అవకాశాలు దక్కడం కష్టమే అంటున్నారు. టాలీవుడ్ ఒకరకంగా ఆమె మీద అనధికారిక నిషేధం విధించేసినట్లే.

ఐతే తెలుగోళ్లు కేథరిన్‌ను వెళ్లగొట్టేసినా.. కోలీవుడ్ జనాలు మాత్రం ఆమెను నెత్తిన పెట్టుకుంటున్నారు. ఆమె చేతిలో మంచి ప్రాజెక్టులున్నాయి. జీవా సరసన ‘కథానాయగన్’… విష్ణు విశాల్ సరసన ‘కదంబన్’ సినిమాలు చేస్తూనే.. తాజాగా ఇంకో క్రేజీ ఛాన్స్ కొట్టేసింది కేథరిన్.

ఈ మధ్యే దేవి (తెలుగులో అభినేత్రి) సినిమాతో కోలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా.. తమిళంలో కథానాయకుడిగా ఇంకో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా పేరు.. యంగ్ మంగ్ సంగ్. అర్జున్ అనే కొత్త దర్శకుడు ఈ వెరైటీ టైటిల్‌తో సినిమా చేయనున్నాడు. ప్రభుదేవా, కేథరిన్ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు పరిచయమే కావడంతో ఈ చిత్రాన్ని మన దగ్గరా రిలీజ్ చేస్తారట.


Recent Random Post: