
నిన్నమొన్నటి వరకూ షూటింగ్ పార్ట్ లో బిజీగా ఉన్న బాహుబలి 2 ఇప్పుడు గ్రాఫిక్స్ వర్క్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ కు సంబంధించిన పనులు మొదట్నించి చేస్తున్నా.. రిలీజ్ డేట్ దగ్గర పడటం.. వర్క్ భారీగా ఉండటంతో.. అనుకున్న టైంకి సినిమాను విడుదల చేసే పనిలో భాగంగా భారీ ఎత్తున గ్రాఫిక్ వర్క్స్ జరుగుతున్నట్లు చెబుతున్నారు.
బాహుబలి వన్ అనూహ్య విజయాన్ని సాధించటం.. రెండో భాగంపై పెద్ద ఎత్తున అంచనాలు వ్యక్తమవుతున్న వేళ.. అందుకు తగ్గట్లుగా భారీ ఎత్తున గ్రాఫిక్ వర్క్ ను చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేసిన నేపథ్యంలో.. ఆ టైంకి అనుకున్న పని అనుకున్నట్లుగా పూర్తి చేయటానికి భారీ ఎత్తున గ్రాఫిక్ వర్క్ అవసరమవుతుంది. షెడ్యూల్ ప్రకారం విడుదల చేసేందుకు గ్రాఫిక్ వర్క్ ను 36 స్టూడియోల్లో నిర్విరామంగా పని చేస్తున్నారు. గ్రాఫిక్ వర్క్స్ సినిమాకు ఆయువుపట్టుకావటంతో.. వాటి రేంజ్ ఏ మాత్రం తగ్గని రీతిలో పనుల్ని చేయిస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 28న బాహుబలి-2ను విడుదల చేసేందుకు వీలుగా పని చేస్తున్నారు. అనుకున్న తేదీకి సినిమాను విడుదల చేసే పనిలో భాగంగా 36స్టూడియోల్లో నాన్ స్టాప్ గా పని చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున జరుగుతున్న సీజీ పనులు.. వెండి తెర మీద మరెంత భారీగా దర్శనమిస్తాయో చూడాలి.
Recent Random Post: