హీరో.. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ ఎంటి?

ఏదైనా సినిమాలో జంట చూడముచ్చటగా ఉందని చెప్పటం పాత మాట అయిపోయింది. ఇప్పుడు అందుకు భిన్నమైన మాట అందరి నోట వినిపిస్తోంది. హీరో.. హీరోయిన్ పెయిర్ బాగుందన్న దాని కంటే.. సినిమాలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అదిరిపోయిందన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. ఈ మాట మీద తన నిరసనను వ్యక్తం చేశారు టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు.

రీల్ లైఫ్ లో విలక్షణ పాత్రల్ని వేయటమే కాదు.. రియల్ లైఫ్ లో విలక్షణ రీతిలో వ్యవహరిస్తుంటారు. మిగిలిన చాలామంది సెలబ్రిటీల మాదిరి కాకుండా సూటిగా స్పష్టంగా మాట్లాడేస్తారు. మనసులో ఏమీ దాచుకోకుండా మాట్లాడే ఆయన.. తాజాగా జరిగిన గుంటురోడు చిత్ర ఆడియో ఫంక్షన్ సందర్భంగా ఆసక్తికర అంశాన్ని తెర మీదకు తెచ్చారు.

గతంలో ఏదైనా సినిమాలో హీరో.. హీరోయిన్లు చూడముచ్చటగా ఉంటే.. ఈ జంట బాగుంది. చాలా బాగా ఉన్నారు.. చక్కగా నటించే వారని అనేటోళ్లని.. ఇప్పుడు ఆ స్థానే.. హీరో.. హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ బాగా బాగుంటుందని అంటున్నారని చెప్పారు. కెమిస్ట్రీ అనడం తనకు నచ్చదని ఆయన చెప్పారు. మోహన్ బాబు నోటి నుంచి ఈ వాదన విన్న తర్వాత.. కెమిస్ట్రీ పదం కాస్త ఎబ్బెట్టుగా లేదు? మోహన్ బాబు పుణ్యమా అని.. కెమిస్ట్రీ మాటను హీరో.. హీరోయిన్లకు అన్వయించే వారు కాస్త ఆలోచించటం ఖాయం.


Recent Random Post: