మెగా హీరో జడ్జిమెంట్‌ కేక

దర్శకుడిగా ఫెయిలైన వాళ్లతో రిస్క్‌ చేయడానికి ఏ హీరో ఇష్టపడడు. కానీ కథ బాగుంటే ఏ దర్శకుడైనా సక్సెస్‌ అవుతాడని నమ్ముతున్నాడు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌. వాంటెడ్‌ సినిమాతో దర్శకుడిగా మారిన బివిఎస్‌ రవికి మళ్లీ దర్శకుడిగా అవకాశాలు రాలేదు. పూరి జగన్నాథ్‌ వద్ద రచయితగా కొనసాగుతోన్న రవి చెప్పిన కథ విని సాయిధరమ్‌ తేజ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

ఫెయిలైన దర్శకుడితో తేజ్‌ ఎందుకు చేస్తున్నాడనేది పజిల్‌గా మారింది. కానీ తేజ్‌ నమ్మి ఒక సినిమా చేసాడంటే అది మినిమమ్‌ గ్యారెంటీ అని ఇప్పటికే పలుమార్లు రుజువైంది. నిజానికి ‘శతమానం భవతి’ కథని ముందుగా ఓకే చేసిందీ, దిల్‌ రాజుకి వేగేశ్న సతీష్‌ని సిఫార్సు చేసిందీ తేజ్‌. ఆ కథలో పొటెన్షియల్‌ తెలిసిన దిల్‌ రాజు హీరోగా తేజ్‌తో కుదరకపోయినా కథని మాత్రం వదల్లేదు. అదే కథతో ఇప్పుడు దిల్‌ రాజు కోట్లు గడిస్తున్నాడు.

సతీష్‌ వేగేశ్న కూడా బివిఎస్‌ రవిలా రచయితగా మొదలు పెట్టి దర్శకుడయ్యాడు. దర్శకుడిగా ఫెయిలయిన అతనికి బ్రేక్‌ రావడానికి తేజ్‌ పరోక్షంగా కారణమయ్యాడు. మరిప్పుడు అదే నమ్మకంతో రవితో జవాన్‌ చేస్తోన్న తేజ్‌ ఇంకోసారి తన జడ్జిమెంట్‌ రైట్‌ అని ప్రూవ్‌ చేసుకుంటాడా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.


Recent Random Post: