
అల్లు అర్జున్, హరీష్ శంకర్ల కాంబినేషన్లో వస్తోన్న ‘దువ్వాడ జగన్నాధమ్’పై అంచనాలు భారీగానే వున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న బన్నీ స్మార్ట్ ఛాయిస్‌తో తన స్టార్డమ్ పెంచుకుంటూ పోతున్నాడు. గబ్బర్‌సింగ్ తర్వాత డల్ అయినా కానీ హరీష్ శంకర్‌లోని కసిని గుర్తించి ఈ చిత్రాన్ని అతని చేతుల్లో పెట్టాడు.
దిల్ రాజు నిర్మాత కనుక మినిమమ్ గ్యారెంటీకి ఢోకా వుండదనే అనుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో ఈ చిత్రంపై వినిపిస్తోన్న పాజిటివ్ బజ్ మాత్రం బ్లాక్‌బస్టర్‌కి తక్కువ వుండదనే సంకేతాలు అందిస్తోంది. ఇది కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా బాలీవుడ్ వరకు పొక్కిపోయినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ స్టార్ కమర్షియల్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ‘డిజె’ సెట్స్ విజిట్ చేసి హరీష్ శంకర్‌తో చాలా సేపు డిస్కస్ చేసాడు.
బహుశా రీమేక్ రైట్స్ కోసం వచ్చాడేమో అని చెవులు కొరుక్కుంటున్నారు. ‘సింగం’ చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేసిన రోహిత్ శెట్టికి దక్షిణాది చిత్రాలంటే మక్కువ ఎక్కువే. అతని సినిమాల్లో తరచుగా మన సినిమాల్లోని సీన్లు కనిపిస్తుంటాయి. ఈమధ్య కాస్త జోరు తగ్గడంతో క్వాలిటీ సబ్జెక్ట్ కోసం చూస్తూ డిజె గురించి విని ఇటు వచ్చినట్టున్నాడు. దబంగ్ చిత్రాన్ని తెలుగులోకి అద్భుతంగా రీమేక్ చేసాడనే పేరు తెచ్చుకున్న హరీష్‌కి బాలీవుడ్ కనక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. ఈ మీటింగ్ ‘డిజె’ హిందీ వెర్షన్‌కి పునాది వేసిందేమో చూద్దాం.
Recent Random Post: