సూపర్‌స్టార్‌ పరువు తీసేసారు

ఏ హీరోకి అయినా సిక్స్‌ ప్యాక్‌ బాడీ అనేది పెద్ద ఛాలెంజ్‌. యువతరం హీరోలైతే కష్టపడి ఎలాగోలా సిక్స్‌ ప్యాక్‌ తెచ్చుకుంటారు కానీ ఏజ్‌ బార్‌ అయిన హీరోలకి సిక్స్‌ ప్యాక్‌ చేయడం ఈజీ వ్యవహారం కానే కాదు. కష్టపడడానికి ఇబ్బంది లేని వాళ్లు జిమ్‌లో గంటల తరబడి గడిపి మంచి ఫిజిక్‌ సాధిస్తారు కానీ చాలా మంది ఆ కష్టానికి దూరంగా వుండడానికే ఇష్టపడతారు.

అయితే సిక్స్‌ ప్యాక్‌ చేయకుండానే ఫోటోషాప్‌తో సిక్స్‌ప్యాక్‌ ఆబ్స్‌ చూపిస్తే మాత్రం అది ఆ హీరోకే సిగ్గుచేటు. ఫోటోషాప్‌ అని కనిపెట్టేస్తారని తెలిసినా కానీ అజిత్‌ కుమార్‌ పరువు తీసి పారేస్తూ అతని యాభై ఏడవ చిత్రమైన వివేగమ్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌లో సిక్స్‌ ప్యాక్‌ బాడీతో అజిత్‌ని చూపించారు. ఎవరిదో బాడీకి అజిత్‌ తల అతికించినట్టు స్పష్టంగా తెలిసిపోతూ వుండడంతో ఈ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ యాంటీస్‌కి పండగలా మారింది.

అజిత్‌తో వరుసగా రెండు హిట్‌ సినిమాలు తీసిన దర్శకుడు శివతో మళ్లీ అజిత్‌ జత కలవడంతో వివేగమ్‌పై అంచనాలు తారాస్థాయిలో వున్నాయి. ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌పై ఫాన్స్‌ చాలానే ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారు. అజిత్‌ని ఇలా చూడాలనే కోరిక వాళ్లకి వుంటుంది కానీ రియల్‌గా సిక్స్‌ ప్యాక్‌తో చూడాలని అనుకుంటారు కానీ ఈ విధంగా ఫేక్‌ బాడీ చూడాలనుకోరు. బహుశా సినిమాలో అజిత్‌ కుమార్‌ సిక్స్‌ ప్యాక్‌తో కనిపించడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తూ వుండొచ్చు. ఆ బాడీ ఏదో నిజంగా బిల్డ్‌ చేసాకే ఈ లుక్‌ రిలీజ్‌ చేసినట్టయితే ఇలా నవ్వుల పాలు కాకుండా సంచలనమై వుండేది.


Recent Random Post: