
‘రెయీస్’ చిత్రానికి షారుక్ ఖాన్ ఎంత డెస్పరేట్ అయిపోయాడనేది అతని ట్విట్టర్ టైమ్‌లైన్ చూస్తేనే అర్థమవుతుంది. సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్ వరుసపెట్టి బ్లాక్‌బస్టర్లు కొడుతోంటే షారుక్ బాగా వెనకబడిపోయాడు. ఎలాగైనా హిట్టిచ్చి తీరాల్సిన సిట్యువేషన్ ఎదుర్కొంటోన్న దశలో వచ్చిన ‘రెయీస్’ తొలుత ఆశలు రేకెత్తించింది.
కానీ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. నూట యాభై కోట్ల రేంజితో సరిపెట్టుకున్న ఈ చిత్రాన్ని షారుక్ డిఫెండ్ చేసుకోవడానికి కూడా లేకుండా పోయింది. మూడు వందల కోట్ల వసూళ్లని సల్మాన్, అమీర్ అవలీలగా సాధిస్తోంటే, అక్షయ్‌కుమార్ సినిమాల స్థాయి వసూళ్లతో షారుక్ తన సూపర్‌స్టార్ ట్యాగ్‌కి జస్టిస్ చేయలేకపోతున్నాడు. ఫాన్స్ ఆశలన్నీ రెయీస్ మీదే వున్నాయి కానీ అదేమో వాళ్లని నీరుగార్చింది. షారుక్ మలి చిత్రంపై అయితే అభిమానులకే హోప్స్ లేవు.
ఇంతియాజ్ అలీ డైరెక్షన్‌లో వస్తోన్న ‘ది రింగ్’ ఈ ఆగస్టులో రిలీజ్ కానుంది. ఇంతియాజ్ ట్రాక్ రికార్డ్‌ని బట్టి ఈ సినిమాతో బాక్సాఫీస్ అద్భుతాలు ఆశించడం పిచ్చితనమవుతుంది. తనకి నచ్చిన సినిమాలు తీసుకునే ఇంతియాజ్ నుంచి కేవలం విమర్శకులని మెప్పించేవి వస్తాయి కానీ బాక్సాఫీస్‌ని షేక్ చేసే చిత్రాలైతే రావు. మరోసారి షారుక్ ప్రశంసలతోనే సరిపెట్టుకుంటే ఇక తననుంచి ‘బాద్‌షా’ అనిపించుకునే సినిమా మళ్లీ ఎప్పుడొస్తుందో? వరుస పరాజయాలతో ఇప్పటికే తన స్థాయి బాగా పడిపోయింది.
ఇదే కంటిన్యూ అయితే బాలీవుడ్ పేరు చెప్పగానే గుర్తొచ్చే ఖాన్ త్రయం నుంచి ఇతడిని తప్పించి ఖాన్ ద్వయం అంటారేమో కూడా.
Recent Random Post:

















