
పక్కింటి కుర్రాడి ఇమేజ్ సొంతం చేసుకున్న యువ హీరో రాజ్ తరుణ్. గోదారి యాసతో.. ఎటకారంగా.. కాస్తంత నిర్లక్ష్యంతో మాట్లాడే మాటలతో యూత్ ను కాస్త త్వరగానే అట్రాక్ట్ చేయటమే కాదు.. వారి మనసుల్లో రిజిష్టర్ అయ్యాడీ కుర్రాడు. జాగ్రత్తగా సెట్ చేసుకుంటే.. మినిమం గ్యారెంటీ అన్న ట్యాగ్ తెచ్చుకున్న రాజ్ తరుణ్ ను మొన్నటిదాకా లక్కీ ఫెలోగా చాలామంది ఫీలయ్యేవాళ్లు.
కానీ.. ఇప్పుడతగాడి ప్రస్తావన తీసుకొస్తే చాలు.. బ్యాడ్ లక్ కు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే పరిస్థితి. ఉయ్యాలా జంపాలా.. కుమారి 21ఎఫ్.. సినిమా చూపిస్త మావా సినిమాలతో హిట్ మీద హిట్ కొట్టి మాంచి జోరు మీదున్న ఈ కుర్రహీరోకి.. ఎందుకు వచ్చిందో కానీ అతి జాగ్రత్తగా వచ్చేసిందట. అదెంత ఎక్కువైందంటే.. బంగారం లాంటి సినిమాల్ని సైతం చేజార్చుకునేంత.
ఈ మధ్యన విడుదలై సక్సెస్ అయిన శతమానం భవతి.. నేను లోకల్ రెండు సినిమాలు మొదట రాజ్ తరుణ్ దగ్గరకే వెళ్లాయట. అతి జాగ్రత్తతో ఏదేదో మార్పులు చేర్పులు చెప్పాడట. ఇతగాడి తీరు నచ్చక.. లైట్ తీసుకొని వేరే వారికి ఛాన్స్ లు ఇచ్చేశారు. కుర్రహీరో రిజెక్ట్ చేసిన రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవటం ఒక ఎత్తు అయితే.. ఆ రెండు సినిమాల్లోనటించిన శర్వానంద్..నానిలకు మంచిపేరు తెచ్చి పెట్టాయి.
Recent Random Post: