‘ఖైదీ’ తర్వాత ఎటు? క్లారిటీ లేదు

‘అఖిల్‌’లాంటి డిజాస్టర్‌ ఇచ్చినా కానీ వినాయక్‌ సామర్ధ్యంపై నమ్మకంతో ‘కత్తి’ రీమేక్‌ చేసే బాధ్యతని చిరంజీవి అతనికి అప్పగించారు. చిరంజీవి రీఎంట్రీ చిత్రం కనుక ఏమాత్రం తేడా అయినా తనని ఫాన్స్‌ ఎప్పటికీ క్షమించరని తెలిసినా, అది తన కెరియర్‌లో మాయని మచ్చ అవుతుందనేది అర్థం చేసుకున్నా వినాయక్‌ ఛాలెంజ్‌ యాక్సెప్ట్‌ చేసాడు. చిరంజీవిని ఎలా ప్రెజెంట్‌ చేస్తే మాస్‌కి నచ్చుతుందో సరిగ్గా తెలిసిన దర్శకుడు అవడంతో వినాయక్‌ ‘ఖైదీ నంబర్‌ 150’ని చాలా బాగా డీల్‌ చేశాడు.

వంద కోట్ల షేర్‌ సాధించిన సినిమాని అందించిన వినాయక్‌కి ‘నెక్స్‌ట్‌ ఏంటి?’ అనే దానిపై క్లారిటీ లేదు. స్ట్రెయిట్‌ మూవీ అయిన అఖిల్‌ ఫ్లాప్‌ అవడంతో, రీమేక్‌ అయితే బెటరా లేక ధైర్యం చేసి స్ట్రెయిట్‌ సినిమానే చేయాలా? అంటూ వినాయక్‌ ఆలోచనలో పడ్డాడు. చేస్తే ఏ హీరోతో పని చేయాలి, ఎప్పుడు చేయాలనేది కూడా వినాయక్‌ తేల్చుకోలేదు. ఒకానొక టైమ్‌లో ఒక రెండు, మూడు సినిమాలు తీసి రాజకీయాల్లోకి వెళదామని వినాయక్‌ ఆలోచించాడు. కానీ ఇప్పుడు పొలిటికల్‌గా అడుగులు వేసే ఉద్దేశం లేకపోవడంతో, ఎవరైనా స్టార్‌ హీరోతో మలి చిత్రం చేద్దామని చూస్తున్నాడు.

కానీ ఎన్టీఆర్‌, మహేష్‌, చరణ్‌, అల్లు అర్జున్‌, ప్రభాస్‌ ఇలా ఎవరు చూసినా రెండు, మూడు సినిమాలకి ఓకే చెప్పేసి కూర్చున్నారు. ఈ నేపథ్యంలో వినాయక్‌ ఎవరితో సినిమా చెయ్యాలి? మళ్లీ చిరంజీవి కోసమే కథ సిద్ధం చేసుకోవాలా లేక ఎవరైనా కొత్త హీరోని లాంఛ్‌ చేసే బాధ్యత తీసుకుంటాడా?


Recent Random Post: