
ఏమని ముందుగా అనుకున్న తేదీని మార్చారో కానీ అప్పట్నుంచీ ‘సింగం 3’ చిత్రానికి సంబంధించి ఏదీ కలిసి రావడం లేదు. వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిన సింగం 3 జనవరి 26నే విడుదల కావాల్సింది. అప్పుడు తమిళనాడులో జల్లికట్టు ఉద్యమం వేడెక్కి వుండడంతో రిలీజ్‌కి తగిన సమయం కాదని వాయిదా వేసుకున్నారు. ఫిబ్రవరి 9న ఫైనల్‌గా రిలీజ్ అవుతోంటే, ఇప్పుడు తమిళనాడు రాజకీయం వేడెక్కింది.
రోజుకో మలుపుతో తమిళ రాజకీయాలు ఒక సినిమాని తలపిస్తున్నాయి. తమిళ జనమంతా ప్రస్తుతం టీవీలకే అతుక్కుపోతున్నారు. ఇలాంటి టైమ్‌లో ఒక పెద్ద సినిమా రిలీజ్ అయితే టీవీ ఆడియన్స్‌ని థియేటర్ల వైపు రప్పించడం చాలా కష్టం. కానీ ఇక వాయిదా వేసుకునే వీల్లేదు కనుక పరిస్థితులు ఎలా వున్నా కానీ రిలీజ్‌కి సిద్ధమవుతున్నారు.
ప్రతి విషయంలోను ఇబ్బంది పడుతూనే వచ్చిన సింగం 3 ఇలాంటి అననుకూల స్థితిలో ఎంతవరకు నిలబడుతుందనేది ఆసక్తికరమే. తెలుగు వెర్షన్‌కి ఎలాంటి సమస్యలు రాకపోవచ్చు కానీ తమిళనాడులో ఇప్పుడు జనం సినిమా చూసే మూడ్‌లో వున్నారా లేదా సస్పెన్స్. ఒకవేళ తమిళనాడులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని ఇప్పుడున్న సిట్యువేషన్ ఇంకాస్త ఇంటెన్స్ అయిందంటే మాత్రం సింగం డేంజర్‌లో పడిపోతుందనే దాంట్లో అనుమానాలు అక్కర్లేదు.
Recent Random Post: